తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు

ABN , First Publish Date - 2022-07-03T06:20:29+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు అన్నారు.

తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ వైస్‌చైర్మన్‌ ఇరిగి పెద్దులు

జడ్పీ వైస్‌చైర్మన్‌ ఇరిగి పెద్దులు 

నల్లగొండ, జూలై 2: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు అన్నారు. శనివారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో 1, 2, 3, 4, 5, 6, 7వ స్థాయీ సంఘ స మావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించడంకోసంఅధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించవద్దన్నారు. నాంపల్లిలో పాఠశాలల పనులపై ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని సభ్యులు తెలిపారు. నాంపల్లి, మర్రిగూడ, దేవరకొండ, వేములపల్లిలో నీటి సరఫరా సరిగా కొనసాగడంలేదని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. మిర్యాలగూడ మండలంలో ట్రాన్స్‌ఫార్మర్లకోసం దరఖాస్తు చేస్తే ఇప్పటి వరకు ఏర్పా టు చేయలేదని ఆరోపించారు. 

నల్లగొండ మండలం రసూల్‌పురలో విద్యుత్‌ వైర్లు వేలాడుతున్నాయని తెలిపారు. తిరుమలగిరి (సాగర్‌) మండలం ఊట్కూరు, ఎర్రబెల్లి గ్రామాల పాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సాంఘీక సంక్షేమ స్థాయీ సంఘ చైర్‌పర్సన్‌ నారబోయిన స్వరూపరాణి మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. 5వ స్థాయీ సంఘం చైర్‌పర్సన్‌ కంకణాల ప్రవీణ మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలు ప్రజలకు చేరవేయాలన్నారు. సమావేశంలో సీఈవో ఎన్‌.ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T06:20:29+05:30 IST