కరోనా వ్యాప్తి నిరోధానికి చర్యలు

ABN , First Publish Date - 2021-05-18T05:28:42+05:30 IST

కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం శృంగవరపుకోట పంచాయతీలో వాహనంతో శానిటైజేషన్‌ చేశారు.

కరోనా వ్యాప్తి నిరోధానికి చర్యలు
ఎస్‌.కోట సీహెచ్‌సీకి స్వచ్ఛంద సంస్థలు సమకూర్చిన పరికరాలు అందిస్తున్న ఎమ్మెల్యే కడుబండి

శృంగవరపుకోట, మే 17: కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం శృంగవరపుకోట పంచాయతీలో వాహనంతో శానిటైజేషన్‌  చేశారు. దీన్ని ప్రారంభిం చేందుకు వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతో పాటు బ్లీచింగ్‌ వంటి వాటిని చల్లిస్తున్నామని, ప్రతి ఒక్కరూ మాస్కు, భౌతిక దూరం పాటిం చాలని కోరారు. అమెరికాకు చెందిన విభ ఎన్‌ఆర్‌ఐ ఎన్‌జీవో ఆర్గనైజేషన్‌, గురుదేవ చారిటబుల్‌ ట్రస్టు అధినేత రాపర్తి జగదీష్‌ బాబు సంయుక్తంగా సమకూర్చిన ఆక్సిజన్‌ కన్సనే్ట్రటర్‌, రెండు ఆక్సిజన్‌ సిలండర్లు, రెండు ఆక్సిజన్‌ ప్లో మీటర్లను ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆర్‌.త్రినాథరావుకు అందించారు. ఎమ్మెల్యే కూడా ప్రత్యేకంగా రెండు నెబులైజర్స్‌ను ఇచ్చారు. విభ ఎన్‌జీవోను మరో రెండు ఆక్సిజన్‌ కాన్సనే్ట్రటర్‌లు సమకూర్చాలని కోరారు. గ్రామాల్లో కరోనా పాజిటివ్‌లు పెరుగు తున్నందున ఇళ్ల వద్ద ఉండేందుకు అవకాశం లేనివారు స్థానిక సీహెచ్‌సీ రిఫరెన్స్‌తో విజయనగరం జేఎన్‌టీయూ కోవిడ్‌ కేర్‌ కేంద్రంలో చేరవచ్చన్నారు. డాక్టర్‌ ఎస్‌.వి సత్య శేఖర్‌, డాక్టర్‌ రత్న కుమారి, ఎంపీడీవో శ్రీనివాసరావు, శానిటరీ మేస్త్రీ కృష్ణ, వార్డు సభ్యులు మజ్జి శేఖర్‌ తదితరులు ఉన్నారు. 


 

Updated Date - 2021-05-18T05:28:42+05:30 IST