Abn logo
Jun 22 2021 @ 00:05AM

ఊసల మదుం జంక్షన్‌లో ప్రమాదాల నివారణకు చర్యలు


ఎలమంచిలి, జూన్‌ 21: ఊసల మదుం జంక్షన్‌ వద్ద ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్‌, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు చర్చించారు.  ఈ మేరకు సదరు జంక్షన్‌ను పట్టణ ఎస్‌ఐ నరసింగరావుతో పాటు విద్యుత్‌ శాఖ ఏఈ రామకృష్ణ, రోడ్లు భవనాల శాఖాధికారి రవి సోమవారం పరిశీలించారు.  రోడ్డును ఆనుకుని ఉన్న విద్యుత్‌ స్తంభాలను తొలగించి, మదుం వద్ద రోడ్డు ప్రాంతాన్ని విస్తరిస్తే ప్రమాదాల నివారణకు ఆస్కారం ఉంటుందని ఎస్‌ఐ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.