Abn logo
Jul 24 2021 @ 23:47PM

జంక్షన్‌లో ప్రమాదాల నివారణకు చర్యలు

పోలీసు, రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతున్న జోన్‌- 2 ట్రాఫిక్‌ ఏసీపీ శరత్‌ రాజ్‌కుమార్‌

లంకెలపాలెం, జూలై 24: జాతీయ రహదారి లంకెలపాలెం ప్రధానలో కూడలిలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు జోన్‌ -2 ట్రాఫిక్‌ ఏపీసీ శరత్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. శనివారం కూడలిని పరవాడ మండల రెవెన్యూ అధికారులు, ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌ అండ్‌ బీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. జంక్షన్‌లో రెండు వైపులా వాహనాలు వెళ్లేందుకు ఫ్రీ లెఫ్ట్‌ ఉన్నప్పటికీ సబ్బవరం వెళ్లే మార్గంలో ఫ్రీలెఫ్ట్‌ లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయా శాఖల అధికారులతో ఏసీపీ చర్చించారు. సబ్బవరం వెళ్లే మార్గంలో రెండు వైపులా ఫ్రీ లెఫ్ట్‌నకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ సీఐ ఈశ్వరరావు, పరవాడ సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్‌ఐ రామకృష్ణ, సర్వేయర్‌ అప్పారావు, ఎన్‌హెచ్‌ఏఐ ఇంజనీర్‌ శ్రీరామ్‌, ఆర్‌ అండ్‌ బీ జేఈ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.