మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-06-30T05:15:18+05:30 IST

హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని జడ్పీ డిప్యూటీ సీఈవో ముషాహిదాబేగం అన్నారు.

మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
రాయిచూర్‌ రహదారి వెంట మొక్కలు నాటే పనులను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఈవో

- జడ్పీ డిప్యూటీ సీఈవో ముషాహిదాబేగం

అలంపూర్‌ చౌరస్తా, జూన్‌ 29  : హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని జడ్పీ డిప్యూటీ సీఈవో ముషాహిదాబేగం అన్నారు. ఉండవల్లి, మానవపాడు, అయిజ, వడ్డేపల్లి మండలాల్లో బుధవారం ఆమె పర్యటిం చారు. హరితహారం కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. ఉండవల్లి మండలంలోని కలుగొట్ల శివారులో రాయిచూర్‌ రహదారి వెంట మొక్కలు నాటే పనులను పరిశీలించారు. సరైన సమయంలో మొక్కలకు నీరు అందించాలని, వాటి సంరక్షణకు ఆవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. 


మొక్కలను సిద్ధంగా ఉంచాలి

మానవపాడు : ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు నర్సరీలలో మొక్కలను సిద్ధంగా ఉంచాలని జడ్పీ డిప్యూటీ సీఈవో ముషాహిదాబేగం నర్సరీల నిర్వాహకులకు సూచించారు. మండలంలోని చంద్రశేఖర్‌నగర్‌, కలుకుంట్ల, మద్దూరు గ్రామాల్లో ని నర్సరీలను బుధవారం ఆమె పరిశీలించారు. గత హరితహారం కార్యక్రమంలో మిగిలిన మొక్క లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమణారావు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.


మొక్కలకు రక్షణ కల్పించాలి

వడ్డేపల్లి :  నాటిన మొక్కలు ఎండిపోకుండా, జీవాలు తినకుండా సంరక్షించాలని జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో ముషాహిదా బేగం అన్నారు. మండల పరిధిలోని వెంకట్రామ్‌నగర్‌, జూలెకల్‌, గ్రామాల్లో ఆమె పర్యటించారు. రహదారిపై మొక్క లు నాటుతున్న విధానాన్ని ఆమె పరిశీలించారు. మొక్కలకు రక్షణగా కంచె ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వెంకట్రామ్‌నగర్‌ నగర్‌లో క్రీడా ప్రాంగణం పనులను పరిశీలిం చారు. సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి సాత్యకి తది తరులు పాల్గొన్నారు. 


నాటిన ప్రతీ మొక్క బతకాలి

అయిజ : నాటిన ప్రతీ మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో ముషాహిదాబేగం అన్నారు. అయిజ మండల పరిధిలోని వెంకటాపూర్‌ సమీపంలో కర్నూల్‌ రహదారి వెంట మొక్కలు నాటేందుకు తీసిన గోతులను ఆమె పరిశీలించారు. నాటిన మొక్కలకు రక్షణ ఏర్పాటు చేసి పరిశీలిస్తూ ఉండాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాయిప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T05:15:18+05:30 IST