నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-11-28T04:15:19+05:30 IST

నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, వర్షకా లంలో పడిన ప్రతీ నీటి చుక్కను వృథా పోనియకుండా భూమిలో ఇంకే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ పి.ఉ దయ్‌కుమార్‌ అన్నారు.

నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలి
రైతుల అవగాహన సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

 - రైతుల అవగాహన సదస్సులో కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌


ఊర్కొండ, నవంబరు 27: నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, వర్షకా లంలో పడిన ప్రతీ నీటి చుక్కను వృథా పోనియకుండా భూమిలో ఇంకే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ పి.ఉ దయ్‌కుమార్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్‌ కింద వాన నీటి సంరక్షణ-భూగర్భ జలాల పెంపుదలపై ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సుకు కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. మన దేశం, మన రాష్ట్రం వ్యవసాయ అధారిత ప్రాంతం కావడంతో ప్రతి సంవత్సరం పడే వర్షాల కంటే ఎక్కువ నీటిని వాడుకోవడం జరుగుతుందని అన్నారు. దీ ని వల్ల రాను రాను భూగర్భ జలాలు అడుగంటి రాబోయే తరానికి నీ రు లేకుండా పోయే ప్రమాదం ఉందని తెలిపారు. అటువంటి విపత్కర పరిస్థితి రాకుండా నివారించాలంటే పడిన ప్రతి వర్షపు నీటిని భూమిలో ఇంకే విధంగా చూడాలని అన్నారు. దీని కోసం ప్రతి ఇంటిపై పడిన వర్షపు నీరు భూమిలో ఇంకే విధంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసు కోవాలని అన్నారు. మురుగునీరు కాలువ చివరన ఖాళీగా వదలకుండా పెద్ద కమ్యూనిటీ ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నీటి అవస రం అధికంగా లేని ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని, పాటు కాలువల్లో పేరుకుపోయిన మట్టిని, ముళ్లపొదలను తొలగించి నీటిని వృధా కాకుండా చివరి ఆయకట్టు వరకు వెళ్లే విధంగా చూడాలన్నారు. చేలల్లో మోటార్లు స్టార్ట్‌ చేసి మరిచిపోయే పనులు చేయరాదని, అవసరమైన మోతాదులోను నీటిని వాడుకోవాలని సూచించారు. చెరువుల్లో నీరు తగ్గినప్పుడు పూడికతీత పనులు చేపట్టాలని అన్నారు. రైతులకు, ప్రతి వ్యక్తికి నీటి సంరక్షణకు అవగాహన కల్పించాల ని అధికారులను ఆదేశించారు. అంతకుముందు జల సంరక్షణపై భూగర్భ జలాల శాఖ ద్వారా చేపట్టిన వివిధ కార్యక్రమాలు, జిల్లాలో భూగర్భ నీటి మట్టాలు తెలిపే ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం పరిశీలించారు. ఎంపీపీ బక్కరాధ, సర్పంచ్‌ కొమ్మురాజయ్య భూగర్భ జల శాఖ జిల్లా అధికారిణి రమాదేవి, డీఆర్డీవో పీడీ నర్సింగ్‌రావు, సీపీవో భూపాల్‌రెడ్డి, డీపీవో కృష్ణ, ఎంపీడీవో ప్రభాకర్‌, రైతులు, మండల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-28T04:15:19+05:30 IST