జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు: ఎంపీ

ABN , First Publish Date - 2021-10-22T06:26:09+05:30 IST

జిల్లాలో మూడు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య పేర్కొన్నారు.

జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు: ఎంపీ

అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 21: జిల్లాలో మూడు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మైసూరు రక్షణ శాఖ ఆహార ప్రయోగశాల శాస్త్రవేత్తలు రుద్రగౌడ, రవితో కలిసి ఉద్యాన, ఏపీఎంఐపీ అధికారులతో ఎంపీ సమీక్షించారు. జిల్లా కేంద్రంలో వేరుశనగ, టమోటా, చీనీ ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం భవనాలు ఎంపిక చేయాలన్నారు. త్వరలో ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. సమావేశం అనంతరం రక్షణ శాఖ ఆహార ప్రయోగశాల శాస్త్రవేత్తలతో కలిసి ఉద్యాన, ఏపీఎంఐపీ అధికారులు పలు ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత  కలెక్టరేట్‌ సమీపంలోని ఓటీపీఆర్‌ఐలో వేరుశనగ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు భవనాన్ని ఎంపిక చేశారు. అనంతరం బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో కృషివిజ్ఞాన కేందాన్ని పరిశీలించారు. అక్కడి నుం చి అనంతపురం మార్కెట్‌ యార్డుకు చేరుకున్నారు. మార్కెట్‌ యార్డులో టమోటా, చీనీ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు భవనాలు ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ ఫిరోజ్‌ఖాన, ఉద్యాన శాఖ డీడీ పద్మలత, ఏడీలు సతీష్‌, చంద్రశేఖర్‌, పరిశ్రమల శాఖ జీఎం గీతాగాంధీవాణి, మార్కెటింగ్‌ శాఖ ఏడీ పరమేశ్వరన పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T06:26:09+05:30 IST