ఖాళీ స్థలాల్లో పార్కుల నిర్మాణానికి చర్యలు

ABN , First Publish Date - 2021-12-09T05:05:15+05:30 IST

జీవీఎంసీ పరిధిలోని ఖాళీ స్థలాలను పార్కులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీ ఆరో వార్డు పీఎం పాలెం తులసీనగర్‌ పార్కులో వాకర్స్‌ అసోసియేషన్‌, ఫ్రెండ్స్‌ వనితా వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్మించనున్న డాక్టర్‌ జీఆర్‌ రెడ్డి కళావేదిక నిర్మాణానికి ఆయన బుధవారం కార్పొరేటర్‌ లక్ష్మీప్రియాంకతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఖాళీ స్థలాల్లో పార్కుల నిర్మాణానికి చర్యలు
కళావేదికకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి 

పీఎం పాలెంలో కళావేదిక నిర్మాణానికి శంకుస్థాపన  

కొమ్మాది, డిసెంబరు 8: జీవీఎంసీ పరిధిలోని ఖాళీ స్థలాలను పార్కులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీ ఆరో వార్డు పీఎం పాలెం తులసీనగర్‌ పార్కులో వాకర్స్‌ అసోసియేషన్‌, ఫ్రెండ్స్‌ వనితా వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్మించనున్న డాక్టర్‌ జీఆర్‌ రెడ్డి కళావేదిక నిర్మాణానికి ఆయన బుధవారం కార్పొరేటర్‌ లక్ష్మీప్రియాంకతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవీఎంసీ నిర్మించే పార్కుల్లో వాకింగ్‌ట్రాక్‌, ప్లాంటేషన్‌, కాంపౌండ్‌వాల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు  పీఎం పాలెం ఆఖరిబస్టాప్‌ వద్ద వార్డు కార్పొరేటర్‌ ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిళ్లా సుజాత, చంద్రరావు,  రోసిరెడ్డి, మూర్తిబాబు, పిళ్లా రమణబాబు, తదితరులు పాల్గొన్నారు.



చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలి  

భీమునిపట్నం: విద్యార్థులను చదువుతో బాటు క్రీడలలోనూ తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మంత్రి ముత్తంశెట్టి  పిలుపు నిచ్చారు. బుధవారం  స్థానిక ప్రభుత్వ ఎస్‌విఎల్‌ఎన్‌ఎస్‌ డిగ్రీ కళాశాలలో  ఏయూ  ఇంటర్‌ కాలేజీ కబడ్డీ మీట్‌ కమ్‌ ఇంటర్‌ యూనివర్సిటీ సెలక్షన్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుపై ఒత్తిడి పెట్టకుండా క్రీడలపై మక్కువ కలిగేలా చూడాలన్నారు. అనంతరం కబడ్డీ పోటీలను  ప్రారంభించారు.  క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఏయూ పీడీ ప్రొఫెసర్‌ ఎన్‌.విజయమోహన్‌ మాట్లాడుతూ పోటీల్లో  22 పురుషుల కబడ్డీ జట్లు పాల్గొంటున్నాయన్నారు.  తొలిరోజు గరివిడి, భీమిలి డిగ్రీ కళాశాలల జట్ల మధ్య పోటీ  సాగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌.మంజుల, ఏయూ హెచ్‌ఓడీ ఎ.పల్లవి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.గౌరీశంకర్‌, భీమిలి  జడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు,  ప్రభావతి,  రమణ, నరసింగరావు ప్రసాద్‌, రమేష్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-09T05:05:15+05:30 IST