కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగుల అర్థనగ్న ప్రదర్శన

ABN , First Publish Date - 2021-06-22T05:43:53+05:30 IST

తమను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మినుములూరు పీహెచ్‌సీ పరిధిలోని చింతలవీధి హెల్త్‌ సబ్‌సెంటర్‌ వద్ద సోమవారం కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగులు అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు.

కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగుల అర్థనగ్న ప్రదర్శన
చింతలవీధి సబ్‌సెంటర్‌ వద్ద వైద్య సిబ్బంది అర్థ నగ్న ప్రదర్శన



పాడేరు, జూన్‌ 21: తమను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మినుములూరు పీహెచ్‌సీ పరిధిలోని చింతలవీధి హెల్త్‌ సబ్‌సెంటర్‌ వద్ద సోమవారం కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగులు అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. పాదయాత్రలో తమను రెగ్యులర్‌ చేస్తామని జగన్‌ ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్‌ చేయాలని సంఘం నేతలు శెట్టి నాగరాజు, బి.ఎలిషారావు డిమాండ్‌ చేశారు. రెండు దశాబ్దాలుగా కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేస్తున్న తమను ప్రభుత్వం దగా చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనిరసన కార్యక్రమంలో కాంట్రాక్ట్‌ వైద్య సిబ్బంది మూర్తి, జగన్‌, దామోదర్‌, భూపతిరాజు, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-06-22T05:43:53+05:30 IST