బ్యాంకు చెక్కుపై కనిపించే ఆ రెండు గీతల అర్థం ఏమిటో మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-01-14T14:47:28+05:30 IST

చెక్కు అనేది నగదు చెల్లింపులకు ఉన్న ఒక మార్గం.

బ్యాంకు చెక్కుపై కనిపించే ఆ రెండు గీతల అర్థం ఏమిటో మీకు తెలుసా?

చెక్కు అనేది నగదు చెల్లింపులకు ఉన్న ఒక మార్గం. చెక్కులను బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇస్తుంటాయి. దీని ద్వారా కస్టమర్ ఎవరికైనా నగదు చెల్లింపు చేయవచ్చు. నగదు చెల్లింపులకు సంబంధించి మీరు ఎప్పుడో ఒకసారైనా ఎవరో ఒకరికి చెక్కు ఇచ్చి ఉంటారు లేదా మరొకరి నుంచి చెక్కును తీసుకుని ఉంటారు. ఈ విధానంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నగదు బదిలీ చేసుకోవచ్చు. ప్రతి చెక్కుపై సంతకం ఉంటుంది. ఇది వన్-వే చెల్లింపు ఆర్డర్‌ను ఇస్తుంది. మీరు చెక్కుపై రాసేటప్పుడు చెల్లింపుదారుడి పేరు, బ్యాంకు వివరాలు మొదలైనవాటిని చూసేవుంటారు. కానీ, వీటన్నింటితో పాటు చెక్కుపై గీసిన రెండు గీతలు ఉండటాన్నిమీరు చూసే ఉంటారు. ఈ గీతలు చెక్కులో ఒక మూలన కనిపిస్తాయి. అయితే ఈ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ లైన్లు ఏ డిజైన్ కోసమో రూపొందించినవి కాదు. వీటి వెనుక ఎంతో అర్థం ఉంది. చెక్‌పై కనిపించే ఈ గీతలు ఒక షరతుకు సంబంధించినవి. మీరు ఎప్పుడైనా ఎవరికైనా చెక్ జారీ చేసినట్లయితే, ఈ లైన్ల గురించి ముందుగా తెలుసుకోండి. లేదంటే అవతలివైపువారు ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఎవరి పేరు మీద చెక్కు రాసివుంటుందో వారి కోసమే ఈ లైన్లు నిర్దేశించి ఉంటాయి చెక్కు మీద పేరు ఉన్నవారే ఈ నగదును అందుకుంటారు. ఈ డబుల్ లైన్.. ఖాతా చెల్లింపుదారుకు చిహ్నంగా పరిగణిస్తారు. దీని కారణంగా చెక్కు అందుకున్న వ్యక్తి ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది. ఉదాహరణకు మీరు వికాస్ శర్మ అనే వ్యక్తికి ఇటువంటి లైన్లు కలిగిన చెక్కును ఇచ్చారని అనుకుందాం. అప్పుడు చెక్కులో రాసిన మొత్తం వికాస్ శర్మ ఖాతాకు మాత్రమే బదిలీ చేయబడుతుంది. ఈ విధానంలో నగదును విత్‌డ్రా చేయడం సాధ్యం కాదు. చెక్కులో ఎవరి పేరు ఉందో ఆ ఖాతాకే నగదు బదిలీ అవుతుంది. చాలామంది ఖాతాదారులు రెండు లైన్లు ఉన్న చెక్కుపై అకౌంట్ పేయీ లేదా ఏ/సి పేయీ అని కూడా రాస్తారు. దీనిద్వారా ఆ చెక్కులోని మొత్తాన్ని ఆ వ్యక్తి ఖాతాకే బదిలీ చేయాలని స్పష్టమవుతుంది. ఇలా రాసి బ్యాంకులో చెక్కు వేసిన తరువాత.. నగదు రూపంలో ఆ మెత్తాన్ని అందుకోలేరు. ఈ డబ్బు సంబంధిత వ్యక్తి ఖాతాకే బదిలీ అవుతుంది. కాగా బ్యాంకులు ఖాతాదారులకు పరిమిత సంఖ్యలోనే చెక్కులు జారీ చేస్తాయి. అదనంగా చెక్కులు అవసరమైతే సంబంధిత బ్యాంకు నిర్ణీత ఛార్జీలను వసూలు చేస్తుంది.

Updated Date - 2022-01-14T14:47:28+05:30 IST