Abn logo
Sep 26 2021 @ 00:44AM

ఆటల పండుగ

ఇనుగుర్తి హైస్కూల్లో రాష్ట్రస్థాయి వాలీబాల్‌ క్రీడలకు సిద్ధమైన మైదానం

గురువుకు క్రీడలతో నివాళి

కందునూరి కొమురయ్య స్మారకార్థం పోటీలు

నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహణ

13 జట్లు, వందమంది క్రీడాకారుల హాజరు

రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు సిద్ధమైన ఇనుగుర్తి

కేసముద్రం, సెప్టెంబరు 25 : విద్య నేర్పిన గురువుకు నివాళులర్పించేందుకు ఇనుగుర్తి సిద్ధమైంది. క్రీడాగ్రామంగా.. వాలీబాల్‌కు పుట్టినిల్లుగా అంతర్జాతీయస్థాయిలో ఖ్యాతిగాంచిన ఇనుగుర్తిలో అపర ద్రోణాచార్యుడిగా పిలుచుకునే వాలీబా ల్‌ గురువు కందునూరి కొమురయ్య(కొమురయ్య సార్‌)కు ఆయన వర్థంతి సందర్భంగా పోటీలతో ఘనంగా నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇనుగుర్తి జడ్పీహైస్కూల్‌ ఆవరణలో  కొమురయ్య స్మారకార్థం తెలంగాణ రాష్ట్రస్థాయి ఆహ్వానిత వాలీబాల్‌ పోటీలను ఇనుగుర్తి వాలీబాల్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు గ్రామాని కి చెందిన గాయత్రి గ్రానైట్స్‌ అధినేత వద్దిరాజు కిషన్‌, రవిచంద్ర సోదరులు, సొసైటీ చైర్మన్‌ ధీకొండ వెంకన్న, సర్పంచ్‌ దార్ల రాంమూర్తి, క్రీడాకారులు, తదితరుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు భారత వాలీబాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కన్న వెంకటనారాయణ తెలిపారు. తొలిరోజు కలెక్టర్‌ శశాంక ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననుండగా చివరి రోజు ఎస్పీ కోటిరెడ్డి హాజరుకానున్నారు. ఈ పోటీలకు సరూర్‌నగర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ, హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌, హన్మకొండ జేఎన్‌ఎ్‌స,  అదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లా టీంలు, ఇల్లందు, గంగారం, కొత ్తగూడ, ములుగు జిల్లా కామారం, మంగపేట తిమ్మాపూర్‌, ఇనుగుర్తి టీంలు పా ల్గొంటున్నాయి. 100 మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యే ఈ పోటీలకు రెండు కోర్టులను విద్యుత్‌ దీపాలతో డేఅండ్‌నైట్‌ మ్యాచ్‌లు నిర్వహించే విధంగా ఏర్పా టు చేశారు.  ఈ క్రీడల నేపఽథ్యంలో రెండు రోజుల నుంచే ఇనుగుర్తిలో ఒక పం డుగ వాతావరణం నెలకొంది. పోటీల్లో గెలుపొందిన ప్రథమ జట్టుకు రూ.50వేలు, ద్వితీయ జట్టుకు రూ.40వేలు, తృతీయస్థానం సాధించిన జట్టుకు రూ.30వేలతో పాటు మొత్తం రూ.1.40 లక్షల ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నారు. గ్రామంలో ప్రతీ ఒక్కరికి వాలీబాల్‌తో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉంటుంది.   

కొమురయ్య ప్రస్థానం..

ఇనుగుర్తి గ్రామానికి చెందిన కందునూరి పుల్లయ్య, లచ్చమ్మల దంపతులకు 1922లో జన్మించిన కొమురయ్య మహబూబాబాద్‌, వరంగల్‌ ప్రాంతాల్లో నైజాం ప్రభుత్వ హయాంలో 7వ తరగతి వరకు ఉర్దూమీడియంలో విద్యనభ్యసించారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వగల ఆయన విద్యార్హతలకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం లభించింది. తొలుత ఇనుగుర్తి సమీపంలోని ఒక తండాలో పనిచేసి ఆ తర్వాత గొట్లకొండ, కురవి, బలపాల ప్రాంతా ల్లో పనిచేసి 1949లో ఇనుగుర్తి పాఠశాలకు వచ్చారు. ఇనుగుర్తిలోని వాలీబాల్‌ క్రీడపట్ల ఆసక్తి ఉన్న సట్ల బిక్షపతి, మల్లారెడ్డి, శంకరయ్య, సట్ల సోమయ్య, ఆవు ల చంద్రయ్య, మరికొంతమందిని డోర్నకల్‌లో జరిగిన వాలీబాల్‌ టోర్నమెంట్‌కు కొమురయ్య తీసుకువెళ్లాడు. ఆనాటి నుంచి క్రీడాకారులకు అండగా ఉంటూ తన కు తెలిసిన మెళకువలను చెబుతూ మాజీ జాతీయ క్రీడాకారుడు సట్ల బిక్షపతి సహకారంతో శిక్షణ ప్రారంభించారు. శిష్యులను వెంట తీసుకొని ఎక్కడ వాలీబాల్‌ పోటీలు జరిగినా తీసుకువెళ్లేవాడు. 

1975 నుంచే విజయపరంపర..

కొమురయ్య శిక్షణలో తొలిసారిగా 1975లో కందునూరి పిచ్చయ్య అనే క్రీడాకారుడు అండర్‌-14 విభాగంలో ఏపీ రాష్ట్ర జట్టుకు ఎంపికై జాతీయస్థాయిలో పాల్గొన్నాడు. 1976లో దేవురప్పులలో జరిగిన కృష్ణసాగర్‌ మెమోరియల్‌ వాలీబాల్‌ క్రీడల్లో ఇనుగుర్తి కీడ్రాకారులు మొదటి బహుమతి సాధించారు. అక్కడి నుంచి మొదలైన కొమురయ్యసారు శిష్యుల విజయపరంపర ఆ తర్వాత 1977లో తాళ్లపెల్లి సాంబయ్య అండర్‌-16లో జాతీయ గ్రామీణ వాలీబాల్‌ క్రీడల్లో ఏపీ నుంచి పాల్గొని బంగారు పతకం సాధించాడు. ఆ తర్వాత 1993లో కన్న వెంకటనారాయణ అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదిగి భారత వాలీబాల్‌ టీం కెప్టెన్‌గా ఏడా ది కాలం, జాతీయ క్రీడాకారుడిగా 22 ఏళ్లు పనిచేశారు. వెంకటనారాయణ కెప్టెన్‌ కావడంతో ఇనుగుర్తికి, కొమురయ్యకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దీంతో వాలీబాల్‌ క్రీడపట్ల ఎంతో ఆకర్షితులై గ్రామంలో 80 మంది జాతీయ, ఒక అంతర్జాతీయ క్రీడాకారుడు ఆయన ఆధ్వర్యంలో రూపుదిద్దుకుని సుమారు 200 షీల్డులు, 100 మెడల్స్‌ సాధించారు. దాదాపు 100 మంది క్రీడాకారులు పోలీ్‌సశాఖలో, మరో 50 మంది వివిధ శాఖల్లో స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందారు. ఇక్కడ వాలీబాల్‌ క్రీడను ఒక వృత్తిగా భావించే విధం గా క్రీడాకారులను ఆయన రూపొందించడం విశేషం. 28, సెప్టెంబర్‌ 2012లో కొమురయ్య మృతి చెందారు. 2013లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయగా పాతగా అవడంతో అదే స్థానంలో కొత్తవిగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపఽథ్యంలోనే తమ గురువుకు క్రీడలతోనే సరైన నివాళులర్పించేందుకు ఈ పోటీలను ఏర్పాటు చేశారు. 

యువ క్రీడాకారులకు స్ఫూర్తి ఈ పోటీలు : కన్న వెంకటనారాయణ, భారత జట్టు మాజీ కెప్టెన్‌ 

ఆహ్వానిత క్రీడలకు హైదరాబాద్‌, హకీంపేట క్రీడా పాఠశాలలు, మెరికల్లాంటి క్రీడాకారులున్న జిల్లా టీంలను ఎంచుకున్నాం. కొమురయ్యసార్‌ శిక్షణలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగి భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాను. ఆయన ఆశయాన్ని నెరవేర్చే విధంగా గ్రామంలోని చిన్నారులు, యువ క్రీడాకారుల్లో స్ఫూర్తినింపేందుకు ఈ పోటీలు ఏర్పాటు చేశాం. 

తొలి బంగారు పతకం సాధించా.. : తాళ్లపల్లి సాంబయ్య , సీనియర్‌ క్రీడాకారుడు, ఇనుగుర్తి

కొమురయ్యసార్‌ శిక్షణలో 1977లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ టీం నుంచి కోల్‌కత్తాలో జరిగిన జాతీయ వాలీబాల్‌ పోటీల్లో పాల్గొని గ్రామంలో తొలిసారి బంగారు పతకం సాధించాను. ఆ తర్వాత జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఆర్టీసీలో స్పోర్ట్స్‌కోటా ఉద్యోగం సాధించి టీటీఈగా పదవీ విరమణ పొందాను. కొమురయ్య సార్‌ రుణం తీర్చుకోలేనిది. ఆయన జ్ఞాపకార్థం పోటీలు జరుగుతుండడం సంతోషదాయకం. 

రూ.1.40 వేల ప్రైజ్‌ మనీ : బొబ్బిలి వెంకట్‌రెడ్డి, ఇనుగుర్తి, వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి 

రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ క్రీడాకారులు హాజరయ్యే క్రీడలకు మూడు రోజులపాటు భోజన వసతి కల్పించేందుకు హైస్కూల్లోనే ఏర్పాట్లు చేశాం.   ఫ్లడ్‌ లైట్లతో రెండు కోర్టులను ఏర్పాటు చేశాం.  పోటీల్లో రాణించిన వారికి రూ.1.40 లక్షల ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నాం.