Abn logo
Oct 19 2021 @ 23:58PM

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌

కబడ్డీ విజేత కురవి జట్టుకు బహుమతి అందజేస్తున్న ఎస్పీ కోటిరెడ్డి

ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి 

మహబూబాబాద్‌ రూరల్‌, అక్టోబరు 19 : క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌తో పాటు జీవితంలో తప్పకుండ విజయం సాధిస్తారని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం వాలీబాల్‌, కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు తమ కేరీర్‌పై దృష్టిపెట్టి క్రీడల్లో రాణించి ముందుకు సాగాలన్నారు. యువతకు ఇలాంటి పోటీలు పెట్టడం ద్వారా వారిలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికి తీయవచ్చని చెప్పారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ఐదు వేల మంది క్రీడాకారులను గుర్తించామన్నారు. వారి ద్వారా గ్రామాల్లో మూఢనమ్మకాలు, గర్భస్త్రశిశు మరణాలు, గంజాయి రవాణాలాంటి వంటిపై అవగాహాన కల్పించి సామాజిక సేవలో భాగస్వాములు చేస్తామన్నారు. జిల్లాస్థాయిలో వాలీబాల్‌లో విజయం సాధించిన కొత్తగూడకు ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి గంగారం గెలుచుకోగా కబడ్డీలో ప్రథమ బహుమతి కురవి, ద్వితీయ బహుమతిని నెల్లికుదురు జట్టు గెలుచుకుంది. వీరికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సదయ్య, రేలా జనార్దన్‌రెడ్డి, సీఐలు రవికుమార్‌, జూపల్లి వెంకటరత్నం, సాగర్‌, తిరుపతి, రాజిరెడ్డి, కరుణాకర్‌రావు, ఆర్‌ఐలు సురేష్‌, పూర్ణచందర్‌, ఎస్బీసీఐ సురేందర్‌, ఐటీసెల్‌ ఇన్‌చార్జ్‌ సీఐ యాసిన్‌, ఎస్సైలు వెంకన్న, రమాదేవి, అరుణ్‌కుమార్‌, రమే్‌షబాబు, రాణాప్రతాప్‌, సురేష్‌, సతీష్‌, నరేష్‌ ఉన్నారు.