ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ

ABN , First Publish Date - 2021-04-16T06:01:56+05:30 IST

ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ

ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
షీటీమ్‌ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి

  ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి 

మహబూబాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 15 : మహబూబాబాద్‌ జిల్లా పోలీసులకు, షీటీమ్‌కు ఫిర్యాదు చేయాలనుకునే బాధిత మహిళలకు ఫోన్‌ ద్వారానే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌చేసి ఎక్కడ నుంచైనా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి గురువారం తెలిపారు. బాధిత మహిళ షీటీమ్‌కు ఫి ర్యాదు చేసేందుకు ముద్రించిన షీ టీం కంప్లైంట్‌ క్యూ ఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ పోస్టర్‌ను ఎస్పీ క్యాంపు కార్యాలయం లో ఎస్పీ కోటిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ ద్వారా ఎక్కడనుంచైనా ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే ఈ షీ టీం కంప్లైంట్‌ క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ పోస్టర్‌లను జిల్లాలోని ఆర్టీసీ బస్సులు, బస్టాండ్‌లలో, రైల్వేస్టేషన్‌లు, సినిమాహాల్స్‌, స్కూళ్లు, కళాశాలలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో అతికించినట్లు చెప్పారు. జిల్లాలో ఎవరైన బాధిత మహిళలు షీటీంకు ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు ముందుగానే తమ మోబైల్‌ నందు క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ను కలిగి ఉండాలని, తమ ఫోన్‌తో పోస్టర్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా జ్ట్టిఞట://్ఞట్టటఞౌజూజీఛ్ఛిజౌఠి.జీుఽ అనే లింక్‌ వస్తుందన్నారు. దీన్ని క్లిక్‌ చేయగానే ఫిర్యాదు ఫోరం ఓపెన్‌ అవుతుంది. అందులో పేరు, లోకేషన్‌, ఇతర వివరాలు నమోదు చేసి సబ్‌మిట్‌ చేయగానే జిల్లా పోలీస్‌ కార్యాలయంలో షీ టీం సాఫ్ట్‌వేర్‌ ఐటీ విభాగానికి చేరుతుంది. అక్కడ నిరంతరం పర్యవేక్షించే ఐటీ సిబ్బంది ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఆ లోకేషన్‌కు దగ్గరలో ఉన్న పోలీస్‌ అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా సంబంధిత అధికారులు లోకేషన్‌కు చేరుకుని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో 100 డయల్‌కు కాల్‌ చేసి తక్షణ పోలీస్‌ సాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐ సరేందర్‌, టౌన్‌ సీఐ వెంకటరత్నం, షీటీం ఎస్సై బాలకృష్ణ, ఎస్సై ఫణిదర్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

ఎస్పీని కలిసిన సీఐలు..

మహబూబాబాద్‌లో ఐటీసెల్‌ విభాగం సీఐ సూర్యప్రసాద్‌, మరిపెడ ఎస్సై శ్రీనివా్‌సరెడ్డిలు గురువారం ఎస్పీ కోటిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గతంలో ఇంటలిజెన్స్‌ వింగ్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన సూర్యప్రసాద్‌ జిల్లా ఐటీసెల్‌ సీఐగా బాధ్యతలు చేపట్టారు.  వరంగల్‌లో ఎస్సైగా పనిచేసిన శ్రీనివా్‌సరెడ్డి మరిపెడ ఎస్సైగా బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. వారిరువురు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 


Updated Date - 2021-04-16T06:01:56+05:30 IST