రూ.17వేలకు చేరిన మిర్చి

ABN , First Publish Date - 2022-01-20T05:50:19+05:30 IST

రూ.17వేలకు చేరిన మిర్చి

రూ.17వేలకు చేరిన మిర్చి

కేసముద్రం, జనవరి 19 : కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. బుధవారం మార్కెట్‌కు 217 మంది రైతులు 492 బస్తాల మిర్చి తీసుకురాగా బహిరంగ వేలం పాటల్లో నాణ్యమైన మిర్చి క్వింటాకు గరిష్ఠంగా రూ.17,090, కనిష్ఠంగా రూ.13,700, సగటున రూ.15,800, తాలురకం మిర్చి గరిష్ఠంగా రూ.11,600, కనిష్ఠంగా రూ.7000, సగటున రూ.9000ల ధరలు పలికాయి. అయితే సగటున అధిక సరుకు మాత్రం రూ.15,000 నుంచి రూ.16000 మధ్యన ధరలు నమోదయ్యాయి. గత మూడు రోజులుగా సగటు ధర రూ.14,900 నుంచి రూ.15,800కి పెరిగింది. మార్కెట్లో ధర ఉన్నప్పటికీ మిర్చి తెగుళ్లు, అకాల వర్షాలతో  దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. 

Updated Date - 2022-01-20T05:50:19+05:30 IST