వజ్రోత్సవంలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2022-08-11T06:02:39+05:30 IST

వజ్రోత్సవంలో భాగస్వాములు కావాలి

వజ్రోత్సవంలో భాగస్వాములు కావాలి

కలెక్టర్‌ శశాంక 

మహబూబాబాద్‌ టౌన్‌, ఆగస్టు 10: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పండుగలా జరుపుకుంటున్న స్వతంత్ర భారత వజ్రోత్సవంలో ప్రజలు భాగస్వాములై విజయవం తం చేయాలని కలెక్టర్‌ శశాంక అన్నారు. ఈ వేడుకల్లో ప్రజలు స్వచ్ఛం దంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని మునిసిపాలిటీలు, మండలాల్లో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమం కొనసాగుందని చెప్పారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతీ ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చా టాలని, జెండాను ఎగురవేసే సమయంలో నిబంధనలు పాటించాలని చెప్పారు. ఇప్పటి వరకు 77వేల కుటుంబాలకు జాతీయ పతాకాలను అందజేశామన్నారు.  జిల్లాలోని 419 పాఠశాలల్లో 6 నుంచి 10 వరతగతి చదివే విద్యార్థుల కోసం 10 ధియేటర్లలో గాంధీ  చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు వివరించారు. ఈనెల 11న నాలుగు మునిసిపాలిటీలతో పాటు 16 మండల కేంద్రాల్లో ఫ్రీడమ్‌ రన్‌ను నిర్వహిస్తున్నామని తెలి పారు. 12న జాతీయ సమైక్య రక్షాబంధన్‌, 13న విద్యార్థులు, ఉద్యోగులతో ర్యాలీలు, 14న సాయంత్రం స్థానిక యశోద గార్డెన్స్‌లో జానపద కళాకా రుల ప్రదర్శనలు, 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపు కోనున్నట్లు పేర్కొన్నారు. 16న తెలంగాణ రాష్ట్ర సామూహిక గీతాలపన, కవి సమ్మెళనం ఉంటుందన్నారు. 17 నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మహబూబాబాద్‌కు సం బందించి జిల్లా ఆస్పత్రిలో, డోర్నకల్‌ నియోజకవర్గ పరిధిలో మరిపెడ పీహెచ్‌సీలో శిబిరాలు ఉంటాయని, రక్తదానం చేయడానికి యువత ముందుకురావాలని కోరారు. 18న ఫ్రీడం కప్‌ ఫైనల్‌ పోటీలుంటాయని, అందుకు 11, 12 తేదీల్లో గ్రామస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నా మన్నారు. 19న అనాథశ్రమాలు, జైళ్లలో పండ్ల పంపిణీ, 20న రంగోలి, 21న మునిసిపాలిటీల్లో ప్రత్యేక సమావేశాలు, 22న ముగింపు కార్యక్ర మం ఉంటుందన్నారు. ప్రజలంతా వేడుకల్లో ఉత్సహాంగా పాల్గొని విజ యంతం చేయాలన్నారు.  ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ మాట్లాడుతూ జిల్లాలో ని అన్ని మండల కేంద్రాల్లో ఈనెల 11న ఉదయం  ఫ్రీడమ్‌ రన్‌ (2 కిలో మీటర్లు) చేపడుతున్నామని, ప్రజలు అత్యధికంగా సంఖ్యలో హాజ రుకావాలని కోరారు. ఇప్పటికే అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారని వివరించారు. వజ్రోత్సవ వేడుకల్లో ప్రతీ ఒక్కరు పాల్గొని దేశఖ్యాతిని ప్రపంచానికి తెలియజేయాలన్నారు.

Updated Date - 2022-08-11T06:02:39+05:30 IST