క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్‌

ABN , First Publish Date - 2021-10-19T05:06:21+05:30 IST

క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్‌

క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్‌
కబడ్డీ ఆడుతున్న కలెక్టర్‌ శశాంక, ఎస్పీ కోటిరెడ్డి

 కలెక్టర్‌ శశాంక

మహబూబాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : క్రీడలు మానసికోల్లాసం కలిగించడమే కాకుండ వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తాయని కలెక్టర్‌ శశాంక అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో సోమవారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 15 నుంచి 21వ తేదీ వరకు పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఎస్పీ నంద్యాల కోటిరెడ్డితో కలిసి ప్రారంభించారు. జిల్లాలోని 18 పోలీ్‌సస్టేషన్‌ల పరిధిలో ఐదు వేల మంది యువత కబడ్డీ, వాలీబాల్‌ క్రీడల్లో పాల్గొన్నట్లు చెప్పారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ శశాంక మాట్లాడుతూ... క్రీడాపోటీలు శారీరక ధారుడ్యం పెంపొందించడమే కాకుండ మానసికోల్లాసం కలుగ చేస్తాయని చెప్పారు. యువత క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్‌ ఉంటుందన్నారు. క్రీడాకారులు గెలుపొటుములను సమానంగా స్వీకరించాలని చెప్పారు. పోలీస్‌ అమరవీరుల సంస్మారణార్థం చేపడుతున్న క్రీడలు సామాజిక గౌరవంలో ఒక భాగమని చెప్పారు. పోలీస్‌ ఉద్యోగాల కోసం ఉచితంగా అందిస్తు న్న శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. పోలీ స్‌శాఖ ఆధ్వ ర్యంలో ఐదు సంవత్సరాలుగా క్రీడా పోటీ లు నిర్వహిస్తున్నామని, గ్రామాల్లో క్రీడా పోటీలు నిర్వహించి అక్క డ గెలుపొందినవారికి జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతీ ఒక్క క్రీడాకారుల వివరాలు నమోదు చేయడం ద్వారా వారి సహాకారంతో కరోనాలో ఉత్తమ సేవలు అందించగలిగామని చెప్పా రు. వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవలందించేందుకు యువత ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు సదయ్య, రేల జనార్దన్‌రెడ్డి, క్రీడల అధికారి అనిల్‌, సీఐలు రాజిరెడ్డి, రవికుమార్‌, శ్రీనివాస్‌, వెంకటరత్నం, కరుణాకర్‌, సాగ ర్‌, తిరుపతి, ఎస్సైలు వెంకన్న, అరుణ్‌కుమార్‌, రమే్‌షబాబు, పీఈటీలు చాంప్లానాయక్‌, మోహన్‌నాయక్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T05:06:21+05:30 IST