టీకా ప్రక్రియను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-04-16T05:57:09+05:30 IST

టీకా ప్రక్రియను విజయవంతం చేయాలి

టీకా ప్రక్రియను విజయవంతం చేయాలి

కలెక్టర్‌ వీపీ గౌతమ్‌

మహబూబాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : వైద్య, స్త్రీశిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తూ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతం చేయాలని  కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై వైద్య, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. టీకా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అంగన్‌వాడీ టీచర్లు నిర్వహించాలన్నారు. వేసే ప్రక్రియను వైద్య శాఖ చేపడుతుందని చెప్పారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎవరు ఏ విధులు నిర్వహించాలో సూచిస్తూ సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేయాలని డీఎంఅండ్‌హెచ్‌వోను కలెక్టర్‌ ఆదేశించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పద్ధతిలో కొనసాగాలని, అందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పీహెచ్‌సీల వద్ద షామీయానాలు వేయడం వల్ల గాలి, అకాల వర్షాలతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, శాశ్వతంగా షెల్టర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. ఈ సమీక్షలో డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీరాం, డీడబ్ల్యూవో సబిత, ఐసీడీఎస్‌ సీడీపీవోలు, తదితరులు  పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T05:57:09+05:30 IST