బయ్యారంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ వాగ్వాదం

ABN , First Publish Date - 2021-04-13T05:43:21+05:30 IST

బయ్యారంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ వాగ్వాదం

బయ్యారంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ వాగ్వాదం
చినిగిన వైస్‌చైర్మన్‌ సత్యనారాయణ చొక్కా

సిబ్బంది తొలగింపు, అక్రమాలపై రాజుకున్న వివాదం 

పోలీసులకు ఇరువర్గాల ఫిర్యాదు 

ఏఎస్పీ విచారణ  

బయ్యారం, ఏప్రిల్‌ 12 : బయ్యారం పీఏసీఎ్‌సలో చైర్మన్‌ మూల మధుకర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ గంగుల సత్యనారాయణ నడుమ  సోమవారం ఘర్షణ చోటుచేసుకుంది. ఈవిషయంపై ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అడిషనల్‌ ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. 2020 ఫిబ్రవరిలో బయ్యారం సొసైటీ చైర్మన్‌గా మధుకర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ సత్యనారాయణలతో పాటు 13 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అయితే చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు ఇరువురు టీఆర్‌ఎస్‌ పార్టీకే చెందిన వారైనప్పటికి అందులో చైర్మన్‌ మంత్రి సత్యవతిరాథోడ్‌ వర్గీయుడిగా, వైస్‌చైర్మన్‌ ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ వర్గీయుడిగా కొనసాగుతుండడంతో అంతర్గతంగా వారి మధ్య విభేదాలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈక్రమంలోనే భూమిని విక్రయించిన టీఆర్‌ఎస్‌ నాయకుడికి రుణం మంజూరు, సొసైటీ సిబ్బందిని తొలగించడంపై సోషల్‌ మీడియాలో చైర్మన్‌పై నెటిజన్ల విమర్శలు చేయడం, అగ్రవర్ణ కులాల వారు బడు గు, బలహీన వర్గాలను అణచివేసేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ కా మెంట్లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. వీటిపై చర్చించేందుకు సొసైటీలో డైరెక్టర్లు సమావేశమయ్యారు. ఇందులో వైస్‌చైర్మన్‌ సిబ్బంది తుడుం రాజేష్‌, బాబులను ఎందుకు తొలిగించాల్సి వచ్చింది.. భూమిని అమ్మిన వారికి రుణం ఎలా మం జూరు చేశారు.. పాలకవర్గం సమావేశానికి తనకు ఎం దుకు సమాచారం ఇవ్వటం లేదంటూ చైర్మన్‌ మధుకర్‌రెడ్డిని ప్రశ్నించారు. ఈక్రమంలో ఇరువురు నడుమ వాగ్వాదం చోటుచేసుకుని బాహాబాహికి దారితీయగా వైస్‌చైర్మన్‌ చొక్కా చినిగింది. దీంతో బయ్యారం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఘటనపై పరస్పరం ఫిర్యాదు చేశారు. చైర్మన్‌ మధుకర్‌రెడ్డి దళిత సామాజిక వర్గానికి చెందిన వైస్‌చైర్మన్‌ సత్యనారాయణపై దాడికి పాల్పడాన్ని నిరసిస్తూ దళిత, బీసీ, గిరిజన సంఘాల నేతలు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న బయ్యారం సీఐ తిరుపతి అక్కడికి చేరుకుని వైస్‌చైర్మన్‌కు న్యా యం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు రాస్తారోకోను విరమించారు. ఇదిలాఉండగా పీఏసీఎస్‌ సమావేశానికి పిలవకపోవడంపై డైరెక్టర్లు బండారి మల్లయ్య, కేతమల్లులు అసహనం వ్యక్తం చేశారు. బయ్యారం సొసైటీ కార్యాలయంలో జరిగిన ఘటనపై చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ సత్యనారాయణ పరస్పరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరువర్గీయులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ తెలిపారు. మరోపక్క వైస్‌చైర్మన్‌ సత్యనారాయణ, సిబ్బంది రాజేష్‌, బాబుల మద్దతుదారులు తమను హతమార్చేకు కుట్రలు పన్నారని సొసైటీ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో ఆరోపించారు..

 



Updated Date - 2021-04-13T05:43:21+05:30 IST