కలెక్టర్‌కు మొక్కను అందజేస్తున్న అదనపు కలెక్టర్ డేవిడ్
మహబూబాబాద్ టౌన్, జనవరి 22: జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఎం. డేవిడ్ బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది అదనపు కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశా రు. గతంలో ఇక్కడ అదనపు కలెక్టర్‌గా పని చేసిన ఎం.డేవిడ్ ఏడాది కిందట ఆదిలాబాద్‌కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానం లో మానుకోట ఆర్డీవో కొమురయ్య అదనపు కలెక్టర్‌గా ఇన్‌చార్జీ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న ఎం.డేవిడ్ మళ్లీ జిల్లా అదనపు కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. శనివారం బాధ్యతలు చేపట్టిన ఎం.డేవిడ్ కలెక్టర్ శశాంకను మర్యాద పూర్వకంగా కలుసుకుని మొక్కను అందజేశారు.