ఒక్కో ఎంబీబీఎస్‌ విద్యార్థికి ఐదు కుటుంబాల ఆరోగ్య బాధ్యతలు

ABN , First Publish Date - 2022-02-17T07:26:42+05:30 IST

ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ని అందించడంలో భాగంగా కుటుంబ దత్తత కార్యక్రమాన్ని(ఫ్యామిలీ అడాప్షన్‌ ప్రోగ్రామ్‌) ప్రవేశపెట్టే అంశాన్ని జాతీ య వైద్య మండలి(ఎన్‌ఎంసీ) పరిశీలిస్తోంది.....

ఒక్కో ఎంబీబీఎస్‌ విద్యార్థికి  ఐదు కుటుంబాల ఆరోగ్య బాధ్యతలు

ఎన్‌ఎంసీ పరిశీలనలో 

కుటుంబ దత్తత కార్యక్రమం


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ని అందించడంలో భాగంగా కుటుంబ దత్తత కార్యక్రమాన్ని(ఫ్యామిలీ అడాప్షన్‌ ప్రోగ్రామ్‌) ప్రవేశపెట్టే అంశాన్ని జాతీ య వైద్య మండలి(ఎన్‌ఎంసీ) పరిశీలిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా... ఎంబీబీఎస్‌ చదివే ప్రతి విద్యార్థి గ్రామాల్లో నివసించే కనీసం ఐదు కుటుంబాలను దత్తత తీసుకోవాలి. ఆయా కుటుంబ సభ్యుల ఆర్యోగాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుండాలి. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆ మేరకు వైద్యసలహాలు అందించాలి. కోర్సు మొదటి ఏడాది నుంచి మూడో ఏడాది వరకు ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తారు. విద్యార్థులు తాము దత్తత తీసుకున్న కుటుంబాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. కార్యక్రమం పూర్తయిన తర్వాత... సంబంధిత కుటుంబాలు, గ్రామం, విద్యార్థులపై దాని ప్రభావాన్ని డేటాబేస్‌ రూపంలో రికార్డు చేస్తారు. గ్రామాల్లో వైద్య సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు ఎంబీబీఎస్‌ విద్యార్థులను పరిపూర్ణ వైద్యులుగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. యూజీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డుకు చెందిన అరుణా వాణీకర్‌, విజయేంద్ర కుమార్‌ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఎంసీ రూపొందించింది.

Updated Date - 2022-02-17T07:26:42+05:30 IST