‘భాగమతి’ ఫేం ఉన్ని ముకుందన్(Unni mukundan) హీరోగా, మియాజార్జ్ (Mia george) హీరోయిన్గా తెరకెక్కిన ‘మయూరాక్షి’(Mayurakshi) చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయిజు ఎస్.ఎస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వరం జయంత్ కుమార్ (Jayanth kumar)నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుందని శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాతల మండలి సెక్రటరి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘‘గోపీసుందర్ సంగీతంలో పాటలన్నీ వినసొంపుగా ఉన్నాయి. ట్రైలర్ క్యూరియాసిటీ కలిగిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఇప్పుడు ఆదరణ బావుంది’’ అని అన్నారు.
నిర్మాత వరం జయంత్ కుమార్ మట్లాడుతూ ‘‘రొమాంటిక్, సస్పెన్స్, క్రేౖమ్ థ్రిల్లర్ ఇది. ఉన్ని ముకుందన్, మియా జార్జ్ నటన, గోపీసుందర్ మ్యూజిక్ సినిమాకు హైలెట్స్. జూన్ 3న సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం’’ అని అన్నారు.