హైదరాబాద్: ఎల్బీనగర్ ముంపు సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపెడుతామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సరూర్‌నగర్, నాగోల్ ప్రాంతాల్లోని కాలనీలకు ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని మేయర్ పేర్కొన్నారు. సరూర్‌నగర్ చెరువుకు వచ్చే నీటిని బయటికి విడుదల చేసిన సందర్భంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా అదనపు బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం చేపడుతామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు.