Abn logo
Sep 27 2021 @ 14:56PM

గులాబ్ తూఫాన్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేశాం: విజయలక్ష్మీ

హైదరాబాద్: గులాబ్ తుఫాన్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేశామని మేయర్ విజయలక్ష్మీ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ 175 జీహెచ్ఎంసీ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కంట్రోల్ రూంకు ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. 200లకు పైగా వాటర్ పంపులు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రెండు రోజుల పాటు భారీ హెచ్చరికలతో బల్దియా సిబ్బంది సెలవులను రద్దు చేశామన్నారు. అత్యవసరం అయితే తప్పా అనవసర కారణాలతో ప్రజలు బయటికి రావద్దని మేయర్ విజయలక్ష్మీ సూచించారు.

ఇవి కూడా చదవండిImage Caption