మేయర్‌ రిజర్వేషన్‌ మార్చారంటూ కోర్టులో రిట్‌ పిటిషన్‌

ABN , First Publish Date - 2022-03-11T17:36:59+05:30 IST

బళ్లారి మేయర్‌, ఉప మేయర్‌ పదవుల రిజర్వేషన్‌ పై ఢార్వాడ్‌ హైకోర్టులో 18వ వార్డు కార్పొరేటర్‌ ముల్లంగి నందీ, మరో ముగ్గురు కార్పొరేటర్లు రిట్‌ పిటిషన్‌ వేశారు. 2021 ఫిబ్రవరి 11న బళ్లారి సిటీ కార్పొరేషన్‌కు

మేయర్‌ రిజర్వేషన్‌ మార్చారంటూ కోర్టులో రిట్‌ పిటిషన్‌

బళ్లారి(కర్ణాటక): బళ్లారి మేయర్‌, ఉప మేయర్‌ పదవుల రిజర్వేషన్‌ పై ఢార్వాడ్‌ హైకోర్టులో 18వ వార్డు కార్పొరేటర్‌ ముల్లంగి నందీ, మరో ముగ్గురు కార్పొరేటర్లు రిట్‌ పిటిషన్‌ వేశారు. 2021 ఫిబ్రవరి 11న బళ్లారి సిటీ కార్పొరేషన్‌కు ఎన్నికల సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేశారు. అప్పుడు మేయర్‌ జనరల్‌ కేటగిరికి, ఉప మేయర్‌ ఓబీసీ మహిళలకు అని పట్టణాల అభివృద్ధి శాఖ నుండి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మార్చి 19న జరగనున్న ఎన్నికల్లో మేయర్‌ జనరల్‌ మహిళ, ఉప మేయర్‌ జనరల్‌గా ప్రకటించారు. దీన్ని సవాల్‌ చేస్తూ కార్పొరేటర్‌ నందీష్‌ ఢార్వాడ్‌ కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. అయితే ప్రభుత్వం తరుపున కూడా రిట్‌ పిటిషన్‌పై కేవియట్‌ దాఖలు చేశారు. ఈ నెల 19న జరిగే మేయర్‌, ఉప మేయర్‌ ఎన్నికల జరుతుతాయా? అనేది తేలాల్సిఉంది.

Updated Date - 2022-03-11T17:36:59+05:30 IST