Ukraine నగర మేయరును కిడ్నాప్ చేసిన రష్యా సైనికులు

ABN , First Publish Date - 2022-03-12T13:16:44+05:30 IST

దక్షిణ ఉక్రెయిన్‌లోని మెలిటోపోల్ నగర మేయర్‌ను రష్యా సైనికులు కిడ్నాప్ చేశారని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్‌కీ, ఉక్రెయిన్ అధికారులు చెప్పారు....

Ukraine నగర మేయరును కిడ్నాప్ చేసిన రష్యా సైనికులు

కైవ్: దక్షిణ ఉక్రెయిన్‌లోని మెలిటోపోల్ నగర మేయర్‌ను రష్యా సైనికులు కిడ్నాప్ చేశారని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్‌కీ, ఉక్రెయిన్ అధికారులు చెప్పారు.పది మంది రష్యా ఆక్రమణదారుల బృందం మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ పార్లమెంట్ ట్విట్టర్‌లో పేర్కొంది.మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ శత్రువులకు సహకరించడానికి నిరాకరించడంతో అతన్ని కిడ్నాప్ చేశారని ఒక వీడియో సందేశంలో జెలెన్స్కీ చెప్పారు.మెలిటోపోల్ నగరాన్ని రష్యా సైనికులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. 


‘‘మెలిటోపోల్ మేయర్‌ని కిడ్నాప్ చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేసిన నేరం... రష్యన్ ఆక్రమణదారుల చర్యలు ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల మాదిరిగానే ఉన్నాయని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ హెడ్ కిరిల్లో టిమోషెంకో టెలిగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. రష్యా దండయాత్రకు ముందు మెలిటోపోల్‌లో కేవలం 1,50,000 మంది నివాసులు మాత్రమే ఉన్నారు.


Updated Date - 2022-03-12T13:16:44+05:30 IST