యాంటీరూమ్‌ రగడ

ABN , First Publish Date - 2020-10-23T08:08:59+05:30 IST

కాకినాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశ మందిరం చేర్చి మేయర్‌ యాంటీరూమ్‌పై దుమారం రేగింది. గతంలో మేయర్‌ సుంకర పావని తనకు యాంటీరూమ్‌ను ఏర్పాటు చేయాలని గత కమిషనర్‌ కె.రమేష్‌ని కోరగా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.

యాంటీరూమ్‌ రగడ

  • మేయర్‌కు, కార్పొరేటర్లకు తెలియకుండా పనులు 
  • కాకినాడ కార్పొరేషన్‌లో దుమారం 

కార్పొరేషన్‌(కాకినాడ), అక్టోబరు 22: కాకినాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశ మందిరం చేర్చి మేయర్‌ యాంటీరూమ్‌పై దుమారం రేగింది. గతంలో మేయర్‌ సుంకర పావని తనకు యాంటీరూమ్‌ను ఏర్పాటు చేయాలని గత కమిషనర్‌ కె.రమేష్‌ని కోరగా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు సూచనల మేరకు కార్పొరేషన్‌ కార్యాలయంలోని పురాతన భవన నిర్మాణంలో మార్పులు చేపట్టారు. ఈ యాంటీరూమ్‌ పనులను కార్పొరేటర్లు గురువారం అడ్డుకున్నారు. కార్పొరేటర్లు వేచి ఉండే గదిని విడదీసి మేయర్‌ యాంటీరూమ్‌ను నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. మేయర్‌కు, కార్పొరేటర్లకు తెలియకుండా పనులు చేపట్టడంతో ఇంజనీరింగ్‌ అధికారుల తీరుపై మేయర్‌ సుంకర పావని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ అధికారులు గతంలోను, ఇప్పు డు తనకు తెలియకుండానే పనులు చేపట్టారన్నారు. కార్పొరేటర్లకు హాలు ఉంచి, తనకు యాంటీరూమ్‌ నిర్మించాలని అధికారులను కోరుతున్నామన్నారు.

Updated Date - 2020-10-23T08:08:59+05:30 IST