Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్లు వదిలి.. బైక్‌లపై తిరగండి : గ్రేటర్ మేయర్

హైదరాబాద్‌ సిటీ : ‘కార్లలో తిరిగితే ప్రజల ఇబ్బందులు తెలియడం లేదు. రోడ్లపై గుంతలు కనిపించడం లేదు. కార్లలో కాకుండా ద్విచక్రవాహనాలపై తిరగండి. గుంతలు, తాగునీటి సమస్యలు గుర్తించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టండి’ అని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో కలిసి అంబర్‌పేట, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌ ప్రాంతాల్లో మేయర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో జోనల్‌ కమిషనర్లతో సమావేశమయ్యారు. వినాయక చవితి నేపథ్యంలో ప్రతి మండపం వద్ద చెత్త కుండీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.


Advertisement
Advertisement