- Udayanidhi
పెరంబూర్(చెన్నై): మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన యువతకు మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విజ్ఞప్తి చేసినట్లు డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయనిధి తెలిపారు. తేనాంపేటలో యువజన విభాగం నిర్వాహకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉదయనిధి మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల ఫలితాలు సీఎం పాలనకు ప్రజలు అందించిన ఆదరణ అన్నారు. ప్రస్తుతం యువజన విభాగం సభ్యుల ఎంపిక ప్రారంభించామని, నియోజకవర్గానికి 10 వేల మందిని సభ్యులుగా చేర్చాలని నిర్ణయించగా, తాజాగా 25 వేలకు పెంచామన్నారు. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ జన్మదినం సందర్భంగా యువజన విభాగం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఉదయనిధి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి