Abn logo
Sep 19 2021 @ 00:25AM

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు

గుంటూరు(కార్పొరేషన), సెప్టెంబరు 18: ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు తెలిపారు. రైలుపేటలోని గొలుసు నాంచారమ్మ, మున్సిపల్‌ కార్పొరేషన బాలికోన్నత పాఠశాల లో శనివారం పర్యటించిన ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ చదువుకి పేదరికం అడ్డంకి కాకూడదనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.  పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా సుమారు 90 మంది విద్యా వలంటీర్లును నియమించామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సాధు ఉమామహేశ్వరి రాజేష్‌, ధూపాటి వంశీబాబు, డిప్యూటీ ఎడ్యుకేషన ఆఫీసర్‌ ప్రమీలారాణి, నమ్రత కుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.