మొదటిసారి ట్విట్టర్ ట్రెండింగ్‌లో మాయావతి

ABN , First Publish Date - 2021-05-17T03:06:33+05:30 IST

ఆదివారం బీఎస్పీ కార్యకర్తలు, మద్దతు దారులు ‘‘నేషన్ వాంట్స్ బెహెన్ జీ’’ (సోదరి కావాలని దేశం కోరుతోంది) అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చారు. చూస్తుండగానే ఇండియా ట్రెండ్స్‌లో నంబర్ వన్ స్థానంలోకి

మొదటిసారి ట్విట్టర్ ట్రెండింగ్‌లో మాయావతి

న్యూఢిల్లీ: రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ అధికారిక ప్రకటనలు కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ఇక విమర్శ ప్రతివిమర్శలు కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విషయం తెలియనిది. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలకు దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది.


సోషల్ మీడియాలో ట్రోలింగ్, ట్రెండింగ్ ద్వారా రోజు వారి అంశాలు తెలుస్తుంటాయి. ఈ విషయంలో సోషల్ మీడియా విభాగాల్లో ట్విట్టర్‌పై ఎక్కువ మందికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న అంశాలను బట్టి రాజకీయ సమీకరణలు కూడా మారతుంటాయంటే అతిశయోక్తి కాదు. కాగా ఈ ట్రెండింగ్‌లో మొట్టమొదటిసారి కనిపించారు బీఎస్‌పీ అధినేత మాయావతి. ఇంతకుముందెప్పుడు ఇలాంటి ట్రెండింగ్‌లో మాయావతి కనిపించలేదు.


ఆదివారం బీఎస్పీ కార్యకర్తలు, మద్దతు దారులు ‘‘నేషన్ వాంట్స్ బెహెన్ జీ’’ (సోదరి కావాలని దేశం కోరుతోంది) అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చారు. చూస్తుండగానే ఇండియా ట్రెండ్స్‌లో నంబర్ వన్ స్థానంలోకి వచ్చింది. ఇప్పటికి ఈ హ్యాష్‌ట్యాగ్‌పై 90 లక్షలకు పైగా ట్వీట్లు పడ్డాయి. కాగా ఈ ట్రెండ్ తర్వాతి స్థానంలో ‘‘అరెస్ట్ మీటూ’’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇది బీజేపీకి వ్యతిరేకంగా తీసుకువచ్చిన ట్రెండింగ్. ఇక మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి మద్దతుగా ‘‘సబ్‌కే సాత్ యోగి సర్కార్’’ ట్రెండింగ్‌లో ఉంది.

Updated Date - 2021-05-17T03:06:33+05:30 IST