భద్రతా లోపంపై విచారణ జరగాలి: మాయావతి

ABN , First Publish Date - 2022-01-06T22:37:46+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపం చాలా ఆందోళన కలిగిస్తోంది. ఈ సంఘటనను చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కారణమైన దోషులపై తగిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో..

భద్రతా లోపంపై విచారణ జరగాలి: మాయావతి

లఖ్‌నవూ: భద్రతా కారణాల వల్ల పంజాబ్ వెళ్లిన ముఖ్యమంత్రి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవ్వడంపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రికే భద్రత లేదని, ఈ విషయాన్ని అత్యంత తీవ్రమైన అంశంగా భావించాలని ఆమె పేర్కొన్నారు. పంజాబ్‌లో బుధవారం జరిగిన సంఘటనపై ఆమె తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు.


‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపం చాలా ఆందోళన కలిగిస్తోంది. ఈ సంఘటనను చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కారణమైన దోషులపై తగిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఉన్నత స్థాయి నిష్పాక్షిక విచారణ అవసరం. పంజాబ్ తదితర రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ ఘటనపై రాజకీయ దుమారం, ఆరోపణలు, రాజకీయాలు చేయడం సరికాదు. ఘటనకు సంబంధించి రాజకీయాలకు విరామం ఇచ్చి, న్యాయమైన దర్యాప్తునకు అనుమతినివ్వాలని కోరుతున్నాను’’ అని మాయావతి ట్వీట్ చేశారు.

Updated Date - 2022-01-06T22:37:46+05:30 IST