ధరల పెరుగులను తీవ్రంగా భావించాలి: కేంద్రానికి మాయావతి సూచన

ABN , First Publish Date - 2022-04-07T19:46:16+05:30 IST

దేశంలో పెరగుతున్న ధరలను కేంద్రం పట్టించుకోవడం లేదని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి సత్వరమే నివారణ చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి అన్నారు. నిరుద్యోగం, ఆర్థికమాంద్యం తీవ్రంగా పెరుగుతున్నాయని..

ధరల పెరుగులను తీవ్రంగా భావించాలి: కేంద్రానికి మాయావతి సూచన

లఖ్‌నవూ: దేశంలో పెరగుతున్న ధరలను కేంద్రం పట్టించుకోవడం లేదని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి సత్వరమే నివారణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి సూచించారు. నిరుద్యోగం, ఆర్థికమాంద్యం తీవ్రంగా పెరుగుతున్నాయని.. ఇది దేశంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలపై గురువారం ఆమె స్పందిస్తూ కేంద్రంపై మండిడపడ్డారు. ‘‘పెట్రోల, డీజిల్, వంటగ్యాస్ వంటి నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా దేశంలోని పేద ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు పెరుగుతున్న నిరుద్యోగం, దానికి తోడు ద్రవ్యోల్బణం.. ఇది దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెంటనే తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలి’’ అని మాయావతి ట్వీట్ చేశారు.

Updated Date - 2022-04-07T19:46:16+05:30 IST