Abn logo
Mar 2 2021 @ 01:56AM

కంగ్రాట్స్.. అమ్మాయా? అబ్బాయా?.. భారత ఓపెనర్‌పై ట్రోలింగ్!

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ట్యాలెంటెడ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ షేర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇటీవల తాను జిమ్‌లో కష్టపడుతున్న ఫొటోను మయాంక్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. జిమ్‌లో చెమటోడుస్తున్న ఈ ఫొటోకు.. ‘‘అంతా శ్రమపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ ఆ శ్రమ చేస్తే అప్పుడే మనలో మార్పు మొదలవుతుంది’’ అని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ ఫొటోను చూసిన న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ వెటకారమాడాడు. ఈ ఫొటోలో మయాంక్ ముఖకవళికలపై కామెడీ కామెంట్ చేశాడు. ‘‘కంగ్రాచ్యులేషన్స్! ఇంతకీ అబ్బాయా లేక అమ్మాయా?’’ అని అడిగాడు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ పోస్టులపై భారీగానే చర్చ జరుగుతోంది.

Advertisement
Advertisement
Advertisement