ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్న మయాంక్ అగర్వాల్

ABN , First Publish Date - 2021-12-03T22:16:18+05:30 IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ సాధించాడు. డరిల్ మిచెట్ వేసిన 59వ ఓవర్ తొలి

ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్న మయాంక్ అగర్వాల్

ముంబై: న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ సాధించాడు. డరిల్ మిచెట్ వేసిన 59వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించిన మయాంక్ టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 199 బంతులు ఎదుర్కొన్న మయాంక్ 13 ఫోర్లు, మూడు సిక్సర్లతో 101 పరుగులు చేశాడు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 80 పరుగుల వద్ద వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది శుభమన్ గిల్ (44), చతేశ్వర్ పుజారా (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) అవుటయ్యారు. వీరు ముగ్గురూ అజాజ్ పటేల్‌కే దొరికిపోయారు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసిన మయాంక్ నిదానంగా ఆడుతూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. ఇద్దరూ కలిసి సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు పెంచే ప్రయత్నం చేశారు.


ఈ క్రమంలో అజాజ్ పటేల్ మరోమారు దెబ్బకొట్టాడు. క్రీజులో కుదురుకుంటున్న సమయంలో శ్రేయాస్ అయ్యర్ (18)ను వెనక్కి పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సాహా.. మయాంక్‌కు అండగా నిలిచాడు ఇద్దరూ కలిసి సమన్వయంతో ఆడుతున్నారు. ఈ క్రమంలో మయాంక్ టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 60 ఓవర్లు ముగిశాయి. ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

Updated Date - 2021-12-03T22:16:18+05:30 IST