కాస్తంత చల్లబడ్డ Retail Inflation .. అయినా RBI టార్గెట్‌కు ఎగువనే..

ABN , First Publish Date - 2022-06-14T00:16:05+05:30 IST

వినియోగదారు ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం(CPI) పోయిన నెల మేలో కాస్తంత చల్లబడి 7.04 శాతంగా నమోదయింది.

కాస్తంత చల్లబడ్డ Retail Inflation .. అయినా RBI టార్గెట్‌కు ఎగువనే..

న్యూఢిల్లీ : వినియోగదారు ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం(CPI) పోయిన నెల మేలో కాస్తంత చల్లబడి 7.04 శాతంగా నమోదయింది. ఆహార పదార్థాలు, వినియోగ వస్తు ధరల్లో స్వల్ప తగ్గుదల ఇందుకు దోహదపడింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిమేర తగ్గినా వరుసగా 5వ నెలలోనూ ఆర్బీఐ(RBI) లక్షిత 4 శాతానికి(+/-2) ఎగువనే ఉందని NSO(నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్) ప్రకటించింది. ఈ మేరకు సోమవారం డేటాను విడుదల చేసింది. కాగా అంతక్రితం నెల ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతంగా నమోదవ్వగా ఇది 8 ఏళ్ల గరిష్ఠంగా ఉన్న విషయం తెలిసిందే. మే నెలలో సీఎఫ్‌పీఐ(కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇన్‌ఫ్లేషన్) 7.97 శాతంగా ఉండగా అంతక్రితం నెల ఏప్రిల్‌లో ఇది 8.09 శాతంగా రికార్డ్ అయిందని ఎన్‌ఎస్‌వో ప్రస్తావించింది. తాజా గణాంకాలు మార్కెట్‌ అంచనా 7.1 శాతం కంటే కనిష్ఠంగానే ఉన్నట్టు ఆర్థిక నిపుణులు గుర్తుచేశారు. పెట్రోల్, డీజెల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు, ఇతర వస్తువులపై కూడా పన్నుల కోత ద్రవ్యోల్బణం తగ్గుదలకు తోడ్పడ్డాయని పేర్కొన్నారు. కాగా ఇటివల కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ రెండుసార్లు రెపో రేట్లు పెంచిన విషయం తెలిసిందే. 

 

క్రూడ్ ఆయిల్(Crude Oil) ధరలు భగ్గుమంటుండడంతో మున్ముందు కూడా ద్రవ్యోల్బణం ఒత్తిడి కొనసాగే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి. రష్యా నుంచి పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నప్పటికీ.. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 10 ఏళ్ల గరిష్ఠం 121 డాలర్లు పలుకుతోన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-06-14T00:16:05+05:30 IST