మ్యాక్స్‌వెల్‌, క్యారీ శతకాలు

ABN , First Publish Date - 2020-09-18T09:05:59+05:30 IST

ఆస్ర్టేలియా జట్టు ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (90 బంతుల్లో 108), అలెక్స్‌ క్యారీ (114 బంతుల్లో 106) సెంచరీలతో కదం తొక్కడంతో ఆఖరి, మూడో వన్డేలో కంగారూలు 3 వికెట్లతో ఉత్కంఠ ..

మ్యాక్స్‌వెల్‌, క్యారీ శతకాలు

ఆసీస్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ

2-1తో సిరీస్‌ కైవసం


మాంచెస్టర్‌: ఆస్ర్టేలియా జట్టు ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (90 బంతుల్లో 108), అలెక్స్‌ క్యారీ (114 బంతుల్లో 106) సెంచరీలతో కదం తొక్కడంతో ఆఖరి, మూడో వన్డేలో కంగారూలు 3 వికెట్లతో ఉత్కంఠ విజయం సాధించారు. 303 పరుగుల భారీ ఛేదనలో.. ఆసీస్‌ ఓ దశలో 73/5తో ఓటమి కోరల్లో చిక్కుకోగా, మ్యాక్స్‌వెల్‌-క్యారీ ఆరో వికెట్‌కు ఏకంగా 212 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గట్టెక్కించారు. ఆసీ్‌సకు ఈ వికెట్‌కు ఇదే అత్యుత్తమ పార్ట్‌నర్‌షిప్‌. ఈ థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో కంగారూలు మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 305/7 స్కోరు చేసి అద్భుత విజయం అందుకున్నారు. అంతకుముందు జానీ బెయిర్‌ స్టో (112) సెంచరీతో రాణించడంతో ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 302 పరుగులు సాధించింది. శ్యామ్‌ బిల్లింగ్స్‌ (57), క్రిస్‌ వోక్స్‌ (53 నాటౌట్‌) అర్ధ సెంచరీలు చేశారు. దీంతో ఫించ్‌ సేన 2-1తో సిరీస్‌ పట్టేసింది. మాంచెస్టర్‌లో ఇదే రికార్డు ఛేదన. 2015 తర్వాత ఇంగ్లండ్‌ స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్‌ కోల్పోవడం ఇదే తొలిసారి. మ్యాక్స్‌వెల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌స’గా నిలిచాడు. 

Updated Date - 2020-09-18T09:05:59+05:30 IST