సిక్సర్‌తో కుర్చీ విరగ్గొట్టిన స్టార్ ప్లేయర్.. విరిగిన కుర్చీ వేలం!

ABN , First Publish Date - 2021-03-04T05:12:57+05:30 IST

ఆసీస్ చిచ్చరపిడుగు గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరోసారి అద్భుతం చేశాడు. కేవలం 31 బంతుల్లో 70 పరుగులు బాదేసి తను మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు నిరూపించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వెల్లింగ్టన్‌లోని వెస్ట్‌పాక్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచులో విశ్వరూపం ప్రదర్శించాడు.

సిక్సర్‌తో కుర్చీ విరగ్గొట్టిన స్టార్ ప్లేయర్.. విరిగిన కుర్చీ వేలం!

వెల్లింగ్టన్: ఆసీస్ చిచ్చరపిడుగు గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరోసారి అద్భుతం చేశాడు. కేవలం 31 బంతుల్లో 70 పరుగులు బాదేసి తను మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు నిరూపించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వెల్లింగ్టన్‌లోని వెస్ట్‌పాక్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచులో విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచులో 31 బంతుల్లో 70 పరుగులు చేసే క్రమంలో బౌండరీలతో బౌలర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో అతను కొట్టిన ఓ సిక్సర్.. స్టేడియంలోని ఓ కుర్చీని విరగ్గొట్టేసింది. దీన్ని చూసిన స్టేడియం చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేన్ హార్మన్.. ఈ విరిగిన సీటుపై మ్యాక్స్‌వెల్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. దీన్ని త్వరలోనే వేలం వేస్తామని, వచ్చిన డబ్బును స్థానికంగా ఉన్న ఓ మహిళా వసతి గృహానికి విరాళంగా ఇస్తామని ఆయన చెప్పారు.

Updated Date - 2021-03-04T05:12:57+05:30 IST