మావోయిస్టు సానుభూతిపరుడు అరెస్టు

ABN , First Publish Date - 2020-11-25T05:09:30+05:30 IST

మావోయిస్టు సానుభూతి పరుడు కంభంపాటి చైతన్య అలియాస్‌ సూర్య(25)ను రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మావోయిస్టు సానుభూతిపరుడు అరెస్టు

ప్రజా సంఘాల్లో చురుగ్గా పని చేస్తూ దళాల్లోకి యువతను ఆకర్షించడమే పని.. 

కేరళ మావోయిస్టు కబని-1 సంఘం ఆదేశాలకనుగుణంగా ఇక్కడ కార్యకలాపాలు 

మళయాళ సాహిత్యం....రూ. పది వేలు స్వాధీనం


గుంటూరు, నవంబరు 24 మావోయిస్టు సానుభూతి పరుడు కంభంపాటి చైతన్య అలియాస్‌ సూర్య(25)ను రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ వివరాలు వెల్ల డించారు. రాజుపాలెం మండలం కొండమోడు గ్రామానికి చెందిన కంభంపాటి చైతన్య తండ్రి రాము మావోయిస్టు సానుభూతి పరుడిగా ఉండేవారు. తండ్రితో పాటు కుమా రుడు చైతన్య కూడా చిన్నప్పటినుంచి మావోయిస్టు కార్యకలా పాలపై ఆసక్తి కనబరిచేవాడు. చైతన్య 2017లో ఒంగోలులో పాలిటెక్నిక్‌ చదివాడు. ఆ సమయం నుంచే విద్యార్థి, ప్రజా సంఘాల్లో కీలకంగా పనిచేస్తూ వచ్చాడు. మావోయిస్టు అను బంధ ప్రజాసంఘాల్లోనూ, కొన్ని ప్రభుత్వ నిషేదిత సంఘా ల్లోనూ పనిచేశాడు. అదేవిధంగా 2019లో కేరళ మా వోయిస్టు సంఘాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడని ఎస్పీ తెలిపారు.  2019 నుంచి కేరళ మావోయిస్టు కబని - 1దళం ఏరియా కమిటీ సభ్యుడిగా ఉన్నాడన్నారు. మావో యిస్టు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న వారిని వెంట బెట్టుకొని వెళ్తుండగా పిడుగురాళ్ళ మండలం జూలకల్లు గ్రామ పరిధిలో గల ఎన్‌ఎస్‌పీ కెనాల్‌ వద్ద చైతన్యను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు.  ఆయా అనుబంధ సంఘలతో కలసి తిరుగుతూ మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేయడం, యువత మావోయిస్టు  పార్టీలో చేరే విధంగా వా రిని ప్రేరేపించడం వంటి కార్యకలాపాలకు పాల్ప డుతు న్నాడన్నారు. చైతన్య నుంచి మళయాళ సాహిత్యంతో పాటు పదివేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. తెలి సీతెలియని వయసులో యువత పెడదోవ పట్టి తమ వి లువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ సూచించారు. జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని, అయినప్పటికీ పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. 

Updated Date - 2020-11-25T05:09:30+05:30 IST