మత్తు పదార్థాలపై అవగాహన ప్రదర్శన

ABN , First Publish Date - 2022-06-26T03:49:10+05:30 IST

సెబ్‌ సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం కోవూరు మండల పరిషత్‌ కార్యాలయం నుంచి బజారు కూడలి వరకు మత్తు పదార్థాలపై అవ

మత్తు పదార్థాలపై అవగాహన ప్రదర్శన
కోవూరులో మాదక ద్రవ్యాల వినిమయ వ్యతిరేక ప్రదర్శన

కోవూరు, జూన్‌ 25: సెబ్‌ సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం కోవూరు మండల పరిషత్‌ కార్యాలయం నుంచి బజారు కూడలి వరకు మత్తు పదార్థాలపై అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సెబ్‌ సీఐ శ్రీధర్‌ మాట్లాడుతూ మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు, ఖైనీ, గుట్కా, పొగాకు ఉత్పత్తులు అధికంగా వాడడంవల్ల మానవాళి ఆరోగ్యం దెబ్బతిని, పచ్చని సంసారాలు నాశనమవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో కల్పన, వివిధ శాఖల అధికారులు, సెబ్‌ సిబ్బంది, పొదుపు సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 


రాపూరులో..


రాపూరు, జూన్‌ 25: మత్తు పదార్థాలతో ముప్పేనని సెబీ సీఐ శ్రీనివాసులు హెచ్చరించారు. రాపూరులో పోలీసులతో కలసి శనివారం ప్రదర్శన చేసి ఆర్టీసీలో ప్రయాణికులకు మత్తుపదార్థాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఎక్కడైనా మత్తుపదార్థాల విక్రయాలు చేపడితే తమకు సమాచారం అందించాలని కోరారు. స్థానిక ఎస్సై, పోలీసులు, సెబీ సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-26T03:49:10+05:30 IST