పేట్రేగుతున్న మట్టి మాఫియా:మాయమవుతున్న గుట్టలు : ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

ABN , First Publish Date - 2021-01-25T04:51:52+05:30 IST

జిల్లాలో మట్టి మాఫియా రోజురోజుకు పెరిగిపోతుంది. భారీ గుట్టలు సైతం మాయమైపోతున్నాయి.

పేట్రేగుతున్న మట్టి మాఫియా:మాయమవుతున్న గుట్టలు  : ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
మట్టి క్వారీ

ప్రభుత్వ అనుమతులు రాక, క్వారీ యజమానుల ఇబ్బందులు

ఖానాపురంహవేలి, జనవరి24: జిల్లాలో మట్టి మాఫియా రోజురోజుకు పెరిగిపోతుంది. భారీ గుట్టలు సైతం మాయమైపోతున్నాయి. జిల్లాలోని రఘునాధపాలెం, ఖమ్మంఅర్బన్‌, రూరల్‌, ముదిగొండ, నేలకొండపల్లి, కూసుమంచి, బోనకల్‌, వైరా, కొణిజర్ల తదితర మండలాల్లో భారీమట్టి గుట్టలు మాయమవుతున్నాయి. వీటిలో ఎక్కువగా ప్రభుత్వ భూములే అధికంగా ఉండడం విశేషం. దీనికి ముఖ్యకారణం ప్రభుత్వం లీజుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ సంవత్సరాలు తరబడిగా అనుమతులు ఇవ్వకపోవడమే కారణం. జిల్లాలో ప్రస్తుతం ఒక క్వారీలీజు, రెండు టీపీక్వారీ అనుమతులకే ఉండడం వలన వినియోగదారులు మట్టిని అధిక ధరలకు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగిలిన ప్రాంతాల్లో లీజులు రాక, టీపీలు (టెంపర్‌వరీ పర్మినెంట్‌) ఇవ్వక మట్టిని అనుమతులు లేకుండానే తోలుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.

భారీగా డిమాండ్‌

 జిల్లాలో రఘునాథపాలెం మండలంలో ఒక లీజు క్వారీ ఒక టీపీ క్వారీ మాత్రమే అనుమతి ఉంది. అలాగే కూసుమంచి మండలంలో ఒక టీపీక్వారీకే అనుమతి ఉంది. దీంతో మట్టి గిరాకీ అధికంగా ఉంది. ఖమ్మం నగరంతో పాటు ఇతర మండలాల్లో ప్రభుత్వ అభివృద్ధి పనులతో పాటు, అధికంగా బిల్డింగ్‌లు, అపార్టుమెంట్లు కట్టడంతో మట్టికి భారీగా డిమాండ్‌ పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు అవసరాల కోసం రోజుకు సుమారు 10వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి అవసరం పడుతుంది. నెలకు సుమారు 3లక్షల క్యూబిక్‌మీటర్ల అసవరమవుతుంది. 

రోజుకు రూ.4లక్షల గండి

ఒక్క క్యూబిక్‌ మీటర్‌కు ప్రభుత్వానికి రూ.40లు చెల్లించాల్సిన ఉంటుంది  అంటే రోజుకు రూ.4లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. జిల్లాలో అవసరమైన మట్టికి ప్రభుత్వం లీజులు ఇవ్వడంతో సంవత్సరాలు కొద్ది లేటు చేయడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా గండిపడుతోంది.

పుంజుకున్న నిర్మాణరంగం

ప్రస్తుతం జిల్లాలో నిర్మాణరంగం భారీగా పుంజుకో వడంతో మట్టి అధికంగా అవసరం పడుతుంది. దీంతో కొందరు మట్టి వ్యాపారులు పగలు, రాత్రీ తేడాలేకుండా అక్రమంగా మట్టితోలకాలు తోలుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. తమ మట్టితోలకాలపై ఖమ్మం గనులు, భూగర్భశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ గంగాధర్‌ ఆధ్వర్యంలో  గతంలో పెనాల్టీ విధించారు. మైనింగ్‌, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులుప్రస్తుతం తనిఖీలు నిర్వహించిన అక్రమ మట్టితోలకాలు మాత్రం రోజురోజకు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం జిల్లాస్థాయి టాస్కుఫోర్సు, మండలస్థాయి కమిటీలు ఏర్పాటుచేసింది.  అక్రమ మట్టి తోలకాలను నిఘా ఏర్పాటుచేసింది. ఇకనైనా ప్రభుత్వం జిల్లా అధికారులతో మట్టి క్వారీలకు సంబంధిత టీపీలు అందుబాటులోకి తీసుకొస్తే మట్టి రేట్లు తగ్డంతోపాటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది

అక్రమ మైనింగ్‌ చేస్తే కఠిన చర్యలు

సంజయ్‌కుమార్‌, గనులుభూగర్భశాఖ 

అసిస్టెంట్‌ డైరెక్టర్‌

జిల్లలో అక్రమంగా మట్టితోలకాలు నిర్వహిస్తేసంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనాలను సీజ్‌చేసి భారీ పెనాల్టీలు విధిస్తాం. జిల్లాస్థాయి, మండల స్థాయి టాస్కుఫోర్సు కమిటీలు ఏర్పాటుచేసి అక్రమ మట్టితోలకాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేశాం. 

Updated Date - 2021-01-25T04:51:52+05:30 IST