నేను ఐపీఎస్‌‌ను.. Matrimony లో ప్రొఫైల్‌ చూశా.. నాకు నచ్చావ్‌.. పెళ్లి చేసుకుందామా అని అడిగి.. కొద్దిరోజుల తర్వాత సీన్ ఇదీ..!?

ABN , First Publish Date - 2021-11-06T14:18:39+05:30 IST

ఓ మహిళ తన కుమార్తెకు సంబంధించిన వివరాలు తెలుగు మ్యాట్రిమోనీలో పొందుపరిచింది. ఆ వివరాలు చూసి...

నేను ఐపీఎస్‌‌ను.. Matrimony లో ప్రొఫైల్‌ చూశా.. నాకు నచ్చావ్‌.. పెళ్లి చేసుకుందామా అని అడిగి.. కొద్దిరోజుల తర్వాత సీన్ ఇదీ..!?

  • నువ్వు నాకు నచ్చావ్‌.. 
  • మ్యాట్రిమోనీలో చూసి ఐపీఎస్‌నంటూ పరిచయం
  • అనుమానంతో ఫిర్యాదు.. నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్ సిటీ/జవహర్‌నగర్‌ : ‘మ్యాట్రిమోనీలో నీ ప్రొఫైల్‌ చూశాను. నువ్వు నాకు నచ్చావ్‌.. పెళ్లి చేసుకుందామా? నేను ఐపీఎస్‌ అధికారిని. హోం మంత్రిత్వశాఖలో పనిచేస్తున్నాను’ అంటూ.. ఓ మహిళను వంచించేందుకు యత్నించాడో మోసగాడు. ఆమెకు అనుమానం రావడంతో వెంటనే జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ మహిళ తన కుమార్తెకు సంబంధించిన వివరాలు తెలుగు మ్యాట్రిమోనీలో పొందుపరిచింది. ఆ వివరాలు చూసిన పుప్పాల హరిప్రసాద్‌ (29) తాను ఐపీఎస్‌ అధికారినంటూ ఆ మహిళను పరిచయం చేసుకున్నాడు.


కొద్దిరోజులు వారిద్దరి మధ్య మాటలు కొనసాగాయి. ఈ క్రమంలో అతనిపై అనుమానం రావడంతో పూర్తి వివరాలు కావాలని ఆమె కోరింది. వెంటనే ఐడీకార్డు, పే స్లిప్పులు, ఐపీఎస్‌గా నియామకం అయిన పత్రాలను మ్యాట్రిమోనీలో అప్‌లోడ్‌ చేశాడు. వాటిపైనా అనుమానం రావడంతో హరిప్రసాద్‌ను నిలదీసింది. దీంతో గత నెల 27న ఆమెకు అతడు ఫోన్‌ చేసి బెదిరించాడు. బాధిత మహిళ చేసిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ భిక్షపతిరావు తెలిపారు. అతడిని మిర్యాలగూడకు చెందిన ఉప్పల హరిప్రసాద్‌గా గుర్తించామన్నారు.

Updated Date - 2021-11-06T14:18:39+05:30 IST