నిర్దిష్ట బ్రా,సన్నని నడుము సైజుతో ఉన్న వధువు కావాలి...matrimonial websiteలో వరుడి వింత ప్రకటన

ABN , First Publish Date - 2021-11-24T16:20:36+05:30 IST

నిర్దిష్ట సైజు బ్రా, సన్నని నడుము పరిమాణంతో ఉన్న వధువు కావాలని ఓ వరుడు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

నిర్దిష్ట బ్రా,సన్నని నడుము సైజుతో ఉన్న వధువు కావాలి...matrimonial websiteలో వరుడి వింత ప్రకటన

నెటిజన్ల ఆగ్రహం

న్యూఢిల్లీ: నిర్దిష్ట సైజు బ్రా, సన్నని నడుము పరిమాణంతో ఉన్న వధువు కావాలని ఓ వరుడు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.స్లిమ్ అండ్ ఫెయిర్ ఉన్న పొడవాటి సంప్రదాయ వధువు కావాలని మ్యాట్రిమోనియల్ ప్రకటన ఇవ్వడం సర్వసాధారణం,కాని ఓ వరుడు బ్రా,నడుము సైజు కూడా ప్రకటనలో పేర్కొనడంతో నెటిజన్లు ఆ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 అడుగుల 2 అంగుళాల నుంచి 5'6" ఎత్తు, 32 బి నుంచి 32 సి సైజు ఉన్న బ్రా, 16 పరిమాణం నడుము ఉన్న వధువు కావాలని కోరుతూ ఓ వరుడు బెటర్‌హాఫ్.ఐ అనే మ్యాట్రిమోనియల్ సైట్‌లో ప్రకటన ఇచ్చారు. వధువు సంప్రదాయవాది కాకుండా ఉదారవాదిగా ఉండాలని, సరదాగా ఉండాలని, మంచంపై పడుకునేటపుడు కూడా దుస్తులు ధరించాలని ప్రకటనలో పేర్కొన్నారు. 


వధువు కుక్కలను కూడా ప్రేమించాలి

దీంతోపాటు యువతి కుక్కలను కూడా ప్రేమించాలని, 18 నుంచి 26 సంవత్సరాల వయసు మధ్య ఉండాలని మ్యాట్రిమోనియల్ ప్రకటనలో వరుడు కోరాడు.తాజాగా కనిపించిన ఈ మ్యాట్రిమోనియల్ ప్రకటన ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించింది. దీనిపై భగ్గుమన్న నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. ‘‘ఈ వ్యక్తి లేడీస్ టైలర్ ఏమిటి?’’ అని కామెంట్స్ విభాగంలో ఒక నెటిజన్ అడిగారు.‘‘ఈ వరుడికి బొమ్మ కావాలి తప్ప భాగస్వామి కాదు. దేవుడు రక్షించుగాక’’ అని మరొకరు వ్యాఖ్యానించారు.అతనికి బార్బీ డాల్ సెట్ ఇవ్వండి అని ఒక నెటిజన్ సూచించారు. 


నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్య తీసుకున్నాం

ట్విట్టర్‌లో ప్రకటన వైరల్ అయిన తర్వాత మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫారమ్ యొక్క నిబంధనలు, షరతులను ఉల్లంఘించినందుకు వినియోగదారుపై చర్య తీసుకున్నట్లు బెటర్ హాఫ్ ఐ సైట్ తెలిపింది.దీనికి ముందు కూడా పలు ఇతర చిత్ర విచిత్రమైన మ్యాట్రిమోనియల్ ప్రకటనలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. 2020లో ‘‘సోషల్ మీడియాకు బానిస కాని వధువు కోసం ఒక ప్రకటన’’ అంటూ ఆన్‌లైన్‌లో కనిపించింది. ఇటీవల ‘‘నాన్-ఫర్టింగ్, నాన్-బర్పింగ్’’ భర్త కావాలని వధువు కోరిన ప్రకటన వైరల్ అయింది.


Updated Date - 2021-11-24T16:20:36+05:30 IST