బాపట్ల, జూలై 3: మధురకవి, సభాసామ్రాట్, సినీగేయ రచయత డాక్టర్ కేవీఎస్ ఆచార్య (80) బాపట్లలోని తన స్వగృహంలో ఆదివారం కన్నుమూశారు. ఐదు దశాబ్దాలపాటు మృదు మధురమైన తన ఉపన్యాసాలతో తెలుగు రాష్ర్టాలలో తిరుగులేని వ్యాఖ్యాతగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన మృతికి భాషాభిమానులు, సాహితీరంగ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎటువంటి సభనైన రక్తి కట్టించటంలో ఆచార్యకు అపారమైన అనుభవం ఉంది. 10 వేలకు పైగా సభలలో పాల్గొని సభా నిర్వాహణలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన సహచరి గతంలోనే కన్నుమూశారు.