Sep 26 2021 @ 23:47PM

ఓ అమ్మకథ

సుధ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘మాతృదేవోభవ’. ఓ అమ్మకథ... అనేది ఉపశీర్షిక. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. దర్శకుడు కె. హరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘భర్తను కోల్పోయి, పిల్లల కోసమే బతికి, వాళ్లను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఓ తల్లికి పిల్లల కారణంగా ఎదురైన చేదు అనుభవాల సమాహారమే మా సినిమా. సుధ అభినయం, మరుదూరి రాజా సంభాషణలు చిత్రానికి ఆయువుపట్టు. యువతరం మెచ్చే అంశాలూ చిత్రంలో ఉన్నాయి’’ అన్నారు. త్వరలో సెన్సార్‌ చేయిస్తామని నిర్మాత చోడవరపు వెంకటేశ్వరరావు చెప్పారు. పతంజలి శ్రీనివాస్‌, అమృతా చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కథ: కేజేఎస్‌ రామారెడ్డి, సంగీతం: జయసూర్య, సమర్పణ: ఎంఎస్‌రెడ్డి.