Apr 15 2021 @ 21:04PM

గోడ ప్రచార సమస్యకు పరిష్కారం చూపే ‘మదిల్‌’

కోలీవుడ్‌: ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలోనూ రాజకీయ పార్టీల నేతలు గోడ ప్రచారం జోరుగా చేస్తుంటారు. ఎంతో ఇష్టపడి, కష్టపడి నిర్మించుకున్న ఇంటి పరిసరాలను ఈ ప్రచారం ద్వారా అందవిహీనం చేస్తుంటారు. తమ ఇంటి ప్రహరీ గోడపై రాజకీయ పార్టీల నేతలు రాసే రాతలు, వేసే బొమ్మలను అడ్డుకోలేక సామాన్యులు లోలోన కుమిలిపోతుంటారు. ఇలాంటి వారికి చక్కని పరిష్కారమార్గాన్ని ‘మదిల్‌’ చిత్రం ద్వారా దర్శకుడు మిత్రన్‌ జవహర్‌ చూపించారు. ‘‘ఎన్‌ సువర్‌.. ఎన్‌ ఉరిమై’’ (నా గోడ.. నా హక్కు) అనే కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమ ఇష్టానుసారంగా గోడలపై ప్రకటనలు అంటించి.. ప్రచారం చేసే రాజకీయ నేతలకు కూడా సరైన గుణపాఠం చెప్పేలా ఈ చిత్ర కథ సాగుతుంది.