చిత్తూరు(సెంట్రల్), మార్చి 7: గుడుపల్లె మండలం శెట్టిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయురాలు తులసి ఫ్రైడే ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైనట్లు ఏపీ మ్యాథ్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణకు చెందిన అకడమిక్ అచీవ్మెంట్ అవార్డు అసోషియేషన్ అందించే ఈ అవార్డుకు మన రాష్ట్రం నుంచి ఐదుగురు ఎంపిక కాగా జిల్లానుంచి తులసీకి స్థానం లభించిందని తెలిపారు.