మ్యాచ్‌ ఫిక్సయింది...

ABN , First Publish Date - 2020-11-30T10:44:01+05:30 IST

భారత్‌-ఆస్ర్టేలియా రెండో వన్డే సంద ర్భంగా ఓ భారత అభిమాని పెళ్లి ప్రతిపాదన చేసి తన ఆసీస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ను అంతులేని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

మ్యాచ్‌ ఫిక్సయింది...

భారత్‌-ఆస్ట్రేలియా రెండో వన్డే సంద ర్భంగా ఓ భారత అభిమాని పెళ్లి ప్రతిపాదన చేసి తన ఆసీస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ను అంతులేని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ప్రియుడు మోకాలిపై నిల్చొని ఉంగరం అందించి పెళ్లికి ప్రపోజ్‌ చేశాడు. ఊహించని ఆ ఘటనతో ప్రియురాలు ఒకింత ఆశ్చర్యానికి లోనైనా వెంటనే తేరుకొని సిగ్గు పడుతూ అతడి ప్రతిపాదనకు సరేనంది. ఆమె ఓకే చెప్పగానే   మైదానంలో ఉన్న మ్యాక్స్‌వెల్‌...చప్పట్లు చరుస్తూ ఆ లవర్స్‌కు మద్దతు పలికాడు.

Updated Date - 2020-11-30T10:44:01+05:30 IST