దిబ్రూగఢ్‌ Universityలో మాస్టర్స్‌

ABN , First Publish Date - 2022-08-12T20:35:03+05:30 IST

దిబ్రూగఢ్‌ యూనివర్సిటీ(University) - మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంఏ(పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌), ఎంటెక్‌(పెట్రోలియం టెక్నాలజీ), మాస్టర్స్‌ ఇన్‌ ట్రావెల్‌ అండ్‌

దిబ్రూగఢ్‌ Universityలో మాస్టర్స్‌

దిబ్రూగఢ్‌ యూనివర్సిటీ(University) - మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంఏ(పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌), ఎంటెక్‌(పెట్రోలియం టెక్నాలజీ), మాస్టర్స్‌ ఇన్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(Masters in Travel and Tourism Management Programme)లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు(semesters) ఉంటాయి. 


ఎంఏ (పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌): ఈ ప్రోగ్రామ్‌లో శాస్త్రీయ నృత్యం 30 సీట్లు, థియేటర్‌ ఆర్ట్‌ 20 సీట్లు, వోకల్‌ మ్యూజిక్‌ 20 సీట్లు ఉన్నాయి. ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ (పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ /శాస్త్రీయ నృత్యం/ ఇండియన్‌ క్లాసికల్‌ డ్యాన్స్‌ / డ్రామా/ థియేటర్‌ ఆర్ట్‌/ వోకల్‌ మ్యూజిక్‌/ మ్యూజిక్‌) ఉత్తీర్ణులు; ఏదేని డిగ్రీ పూర్తిచేసి శాస్త్రీయ నృత్యం/ డ్రామా/ థియేటర్‌ ఆర్ట్స్‌/ వోకల్‌ మ్యూజిక్‌/ మ్యూజిక్‌ తదితరాల్లో స్పెషల్‌ ట్రెయినింగ్‌ పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.


దరఖాస్తు ఫీజు: రూ.700

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 22

ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ తేదీ: ఆగస్టు 25

ఎగ్జామ్‌ సెంటర్‌: డా.భూపెన్‌ హజారికా సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ పర్ఫామింగ్‌ ఆర్ట్స్‌, దిబ్రూగఢ్‌ యూనివర్సిటీ

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: ఆగస్టు 26

అడ్మిషన్‌ తేదీ: ఆగస్టు 30


ఎంటెక్‌  పెట్రోలియం టెక్నాలజీ( Petroleum Technology) (పెట్రోలియం ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ ప్రొడక్షన్‌): ఇందులో 18 సీట్లు ఉన్నాయి. స్థానికులకు 16 సీట్లు, ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు 2 సీట్లు ప్రత్యేకించారు. ప్రోగ్రామ్‌లో భాగంగా ఆయిల్‌ ఇండస్ట్రీస్ లో ఫీల్డ్‌ ట్రెయినింగ్‌, కోర్సు వర్క్‌లు, డిజర్టేషన్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌లు, గెస్ట్‌ లెక్చర్స్‌ ఉంటాయి. రెండో సెమిస్టర్‌ నాటికి అత్యధిక మార్కులతో టాప్‌ పొజిషన్‌లో నిలిచిన అభ్యర్థులకు ఓఎన్‌జీసీ రూ.60,000ల స్కాలర్‌షిప్‌ ఇస్తుంది. అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ/ కౌన్సెలింగ్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. 

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో (బీఈ/ బీటెక్‌)(మెకానికల్‌/ కెమికల్‌/ పెట్రోలియం ఇంజనీరింగ్‌)తోపాటు (ఎమ్మెస్సీ/ ఎంటెక్‌)(అప్లయిడ్‌ జియాలజీ/ జియాలజీ/ జియోఫిజిక్స్‌) పూర్తిచేసి ఉండాలి. ఎమ్మెస్సీ అభ్యర్థులు బీఎస్సీ స్థాయిలో మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.  

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 15

మాస్టర్స్‌ ఇన్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌: ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 25 సీట్లు ఉన్నాయి. రాత పరీక్ష/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. 

అర్హత: ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు/ చివరి సంవత్సర పరీక్షలు రాసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ విభాగాల్లో డిగ్రీ చేసినవారు దరఖాస్తుకు అనర్హులు.

దరఖాస్తు ఫీజు: రూ.700

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 17

వెబ్‌సైట్‌:  www.dibru.ac.in

Updated Date - 2022-08-12T20:35:03+05:30 IST