Abn logo
May 17 2020 @ 09:18AM

‘మాస్ట‌ర్’ రిలీజ్ అప్పుడే..?

విజయ్ కథానాయకుడిగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మాస్ట‌ర్’. ఏప్రిల్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్మాత భావించారు. అయితే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా విడుద‌ల ఆగింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నిర్మాత‌లు ‘మాస్ట‌ర్’ చిత్రాన్ని దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త‌మిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ఒకేసారి విడుద‌ల చేయ‌బోతున్నారు. తెలుగులో మ‌హేశ్ కొనేరు ఈ సినిమాను విడుద‌ల చేస్తారు. 


Advertisement
Advertisement
Advertisement