Abn logo
Nov 28 2020 @ 22:06PM

‘మాస్టర్’ రిలీజ్‌పై మరోసారి చిత్రయూనిట్‌ క్లారిటీ

ఇళయదలపతి విజయ్‌, 'ఖైదీ' దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో చేసిన చిత్రం 'మాస్టర్‌' . ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే కరోనా కారణంగా థియేటర్స్‌ తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యి.. పూర్తి స్థాయిలో ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చే పరిస్థితులు నెలకొన్నప్పుడు సినిమాని విడుదల చేయాలని చిత్రయూనిట్‌ భావిస్తోంది. అయితే ఈ గ్యాప్‌లో కొందరు.. ఈ సినిమా ఓటీటీలో వచ్చేస్తుందనే వార్తలు పుట్టించడంతో.. చిత్రయూనిట్‌ మరోసారి క్లారిటీ ఇస్తూ.. ఓ లెటర్‌ను విడుదల చేసింది.


''అందరం మహమ్మారితో పోరాడుతున్న వేళ.. అందరూ సురక్షితంగా, క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాము. మా చిత్రం మాస్టర్‌ని థియేటర్‌లో చూసేందుకు ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మాకు అర్థమవుతుంది. మీరంతా ఎలా వేచి చూస్తున్నారో.. అంతే ఎగ్జైట్‌మెంట్‌తో మేము కూడా ఆ రోజు కోసం వేచి చూస్తున్నాం. కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్‌పై వస్తున్న రూమర్లకు చెక్‌ పెట్టి.. మా స్టాండ్‌ ఏంటో తెలియజేయాలనుకుంటున్నాం. ఒక ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్‌ వచ్చింది.. కానీ మేము థియేటర్‌లోనే సినిమాని రిలీజ్‌ చేయాలని భావిస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ కష్టకాలంలో ఇండస్ట్రీ తిరిగి నిలబడాలంటే అది చాలా అవసరం. అందుకే, తమిళ ఫిల్మ్‌ ఇండస్ట్రీ మళ్లీ నిలదొక్కుకోవాలంటే.. థియేటర్స్‌ ఓనర్స్‌ కూడా మాకు సపోర్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. త్వరలోనే మంచి న్యూస్‌తో మీ ముందుకు వస్తాం. క్షేమంగా ఉండండి.." అని చిత్రయూనిట్‌ ఓ లెటర్‌ను విడుదల చేసింది. దీంతో ఈ సినిమాపై వస్తున్న రూమర్లకు చెక్‌ పెట్టినట్లు అయ్యింది.


Advertisement
Advertisement
Advertisement